కిస్సింగ్ వారసత్వం: చిరుకు కంఠీరవ.. చరణ్‌కు శివన్న!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా సాగుతున్న రెండు పెద్ద సినీ కుటుంబాల అనుబంధం ఇప్పుడు సరికొత్తగా ఆవిష్కృతమైంది.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా సాగుతున్న రెండు పెద్ద సినీ కుటుంబాల అనుబంధం ఇప్పుడు సరికొత్తగా ఆవిష్కృతమైంది. కన్నడ కంఠీరవ, దివంగత నటదిగ్గజం రాజ్‌కుమార్‌తో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఎంతో గొప్ప స్నేహానుబంధం ఉండేది. ఆ కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవి. గతంలో ఒక సందర్భంలో చిరంజీవిని రాజ్‌కుమార్ ఎంతో ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్న ఒక అరుదైన ఫోటో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే ఆత్మీయతను వారి వారసులు సైతం కొనసాగిస్తూ అభిమానులను మురిపిస్తున్నారు.
ఇటీవల రామ్ చరణ్, శివరాజ్‌కుమార్ (శివన్న) కలయికలో తెరకెక్కిన `పెద్ది` చిత్ర ప్రమోషన్లలో ఒక అరుదైన సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో యాంకర్ స్పందిస్తూ.. నాడు రాజ్‌కుమార్, చిరంజీవిని ముద్దుపెట్టుకున్న ఫోటోగ్రాఫ్‌ని సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయామని ఆ స్వీట్ మూవ్ మెంట్ ని ఇక్కడ రీక్రియేట్ చేయాలని కోరారు. దీంతో ఏమాత్రం సంకోచించకుండా శివన్న వెంటనే రామ్ చరణ్‌ను దగ్గరకు తీసుకుని... ఆప్యాయంగా హగ్ చేసుకుని ముద్దుపెట్టుకున్నారు. నాటితరం నాటి ఆత్మీయ దృశ్యం నేటి తరం హీరోలతో మళ్లీ కళ్లముందు సాక్షాత్కరించడంతో ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇటీవల పెద్ది ప్రమోషన్లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -శివరాజ్ కుమార్ మధ్య సాన్నిహిత్యం, గొప్ప అనుబంధం మీడియాలలో హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. శివన్న తన స్నేహితుడు చరణ్ పై బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. చరణ్ ప్రతిభను ఆకాశానికెత్తుతూ శివన్న ఇటీవల మీడియా ప్రమోషన్స్ లో .. `పెద్ది` చిత్రంలో రామ్ చరణ్ కనబరిచిన అద్భుత నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వరిస్తుందని బలంగా ఆకాంక్షించారు. చరణ్ హార్డ్ వర్క్‌ని సినిమా కోసం అతడి అంకితభావాన్ని మెచ్చుకుంటూ ప్రశంసించారు. `పెద్ది` సినిమాలో రామ్ చరణ్ తన పాత్రలో జీవించేశారని కొనియాడారు. ఇంత పెద్ద స్టార్ స్టాటస్ ఉన్నా.. రామ్ చరణ్ ప్రవర్తించే తీరులోని వినమ్రత ఎంతో గొప్పదని చెప్తూ.. చిరంజీవి గారి లాగే చరణ్ కూడా సెట్స్‌లో అందరినీ గౌరవిస్తారని తండ్రికి తగ్గ వారసుడని శివన్న పేర్కొన్నారు.
రెండు పరిశ్రమలకు చెందిన అగ్ర నటుల మధ్య ఉన్న ఈ అద్భుతమైన బంధాన్ని, ఆత్మీయతను కళ్లారా వీక్షించడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ స్పెషల్ ఇంటర్వ్యూ దృశ్యాలను.. శివన్న రామ్ చరణ్‌ను హగ్ చేసుకుని ముద్దుపెట్టుకున్న రేర్ సీన్ వీడియోను వైరల్ చేస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.