సీనియర్ నటిని ఇమ్మిటేట్ చేసిన సాగరకన్య
తాజాగా శిల్పాశెట్టి వేషధారణను పరిశీలిస్తే... ఓపెన్ హెయిర్, ఫంకీ సన్ గ్లాసెస్, మెడలో రుద్రాక్ష మాల, చేతి మణికట్టుకు బంతిపూలను ధరించి స్పెషల్ భక్తురాలిలా కనిపిస్తోంది.;
ఒక వెటరన్ హీరోయిన్ ని అనుకరిస్తూ, నివాళిగా 90ల నాటి ఐకానిక్ లుక్ ని పునఃసృష్టించడం నిజంగా ఆశ్చర్యపరిచేదే. ప్రముఖ నటి జీనత్ అమన్ కు నివాళులర్పించేందుకు శిల్పాశెట్టి ఒక కొత్త రూపంతో ఆకర్షించింది. ఈ గెటప్ `హరే రామ హరే కృష్ణ` చిత్రంలో జీనత్ అమన్ వేషధారణ. ఈ చిత్రంలో దేవానంద్, ముంతాజ్ కూడా నటించారు.
తాజాగా శిల్పాశెట్టి వేషధారణను పరిశీలిస్తే... ఓపెన్ హెయిర్, ఫంకీ సన్ గ్లాసెస్, మెడలో రుద్రాక్ష మాల, చేతి మణికట్టుకు బంతిపూలను ధరించి స్పెషల్ భక్తురాలిలా కనిపిస్తోంది. ఇది `హరే రామ హరే కృష్ణ` చిత్రంలోని జీనత్ అమన్ ఐకానిక్ లుక్. ఈ చిత్రం 1971లో విడుదలైంది. గ్లామ్ అండ్ టైమ్ లెస్ క్వీన్ జీనత్ అమన్ జీ కి నివాళిగా ఈ కొత్త లుక్ ని అనుకరించానని శిల్పా శెట్టి వెల్లడించారు. నేటికీ మీ ఫ్యాషన్ సెన్స్, మాటలతో స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు అని జీనత్ పై తన ప్రేమను చాటుకున్నారు శిల్పాజీ.
హరే రామ హరే కృష్ణ చిత్రంలోని జీనత్ గెటప్ కి హిప్పీ సంస్కృతి స్ఫూర్తి. అమన్ వెస్ట్రనైజ్డ్ హిప్పీగా కనిపించి ఆశ్చర్యపరిచింది. ఖాట్మండు పర్యటనలో ఉన్నప్పుడు దర్శకహీరో దేవానంద్ కి ఈ ఆలోచన వచ్చిందని చెప్పినట్టు అప్పట్లో కథనాలొచ్చాయి.
నటిగా కెరీర్ మ్యాటర్ కి వస్తే, శిల్ప శెట్టి తదుపరి కన్నడ యాక్షన్ ఎంటర్‌టైనర్ `కేడీ: ది డెవిల్`లో సత్యవతిగా నటించనుంది. ప్రేమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, రీష్మా, నోరా ఫతేహి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.