17 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి..

ఇకపోతే అనుకోకుండా కలిసిన ఈ జంట ఒకరికొకరు నువ్వంటే నాకిష్టం అంటూ సినిమా స్టైల్ లో ప్రపోజ్ చేసుకున్నారు. అప్పటికి షిజు హీరోగా పనిచేస్తూ ఉండగా.. ప్రీతి ఎయిర్ హోస్డేస్ గా పని చేస్తోంది.;

Update: 2025-12-18 09:52 GMT

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య ప్రేమ , పెళ్లి , విడాకులు అత్యంత సాధారణంగా మారిపోయాయి.. ఒకవైపు కొంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే...మరి కొంతమంది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన 6 నెలలకే విడాకులు తీసుకున్న జంటలు ఉన్నాయి. మరి కొంతమంది ఏళ్ల తరబడి వైవాహిక బంధంలో సంతోషంగా జీవించి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత.. ఇప్పుడు సడన్గా విడాకులు తీసుకొని అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారి జాబితాలోకి ఒక టాలీవుడ్ హీరో చేరిపోయారు. 17 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తన భార్యకు విడాకులు ఇచ్చారు..ఈ విషయాన్ని ఆయనే తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఆయన ఎవరో కాదు ప్రముఖ మలయాళ నటుడు షిజు ఏఆర్. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ముఖ్యంగా దేవి సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. అనేక తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.. ఇకపోతే ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన షిజు తాజాగా తన భార్యతో విడిపోయినట్లు వెల్లడించారు. ఆయన తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా.. "నేను, ప్రీతి ప్రేమ్ పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాము. తాజాగా మాకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి ..మేము భార్యాభర్తలుగా విడిపోయినా..మంచి స్నేహితుడుగా కొనసాగుతున్నాము. అయితే మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.. ఇకపై మేము విడివిడిగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాము..దయచేసి ఎటువంటి పుకార్లు సృష్టించవద్దు" అంటూ తెలిపారు.

ఇకపోతే అనుకోకుండా కలిసిన ఈ జంట ఒకరికొకరు నువ్వంటే నాకిష్టం అంటూ సినిమా స్టైల్ లో ప్రపోజ్ చేసుకున్నారు. అప్పటికి షిజు హీరోగా పనిచేస్తూ ఉండగా.. ప్రీతి ఎయిర్ హోస్డేస్ గా పని చేస్తోంది. అయితే వీరిద్దరు తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అతడు ముస్లిం.. ఆమె క్రిస్టియన్.. ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అనే భయంతో ఇంట్లో అడిగి చూసింది. కానీ ఇద్దరి మతాలు వేరు కాబట్టి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. మతం కంటే వ్యక్తిత్వం ముఖ్యమని భావించిన ప్రీతి.. ఎక్కువ ఆలస్యం చేయకుండా మూడు రోజుల్లోనే పెళ్లి చేసుకుందామని చెప్పిందట.

అలా 2008లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు

.వీరికి ఒక కూతురు కూడా ఉంది. కూతురు పుట్టాక కుటుంబ సభ్యులు అంగీకరించడంతో మళ్లీ కూతురు సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు..అలాంటి ఈ జంట ఇప్పుడు 17 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత తమ బంధానికి పులిస్టాప్ పెడుతూ విడిపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మతాలు వేరైనా ఒకరికొకరు ఇష్టపడి మరీ వివాహం చేసుకున్నారు.. అలాంటి ఈ జంట విడాకులు తీసుకోవడం ఏంటి? అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే మరి కొంత మంది వయసుకు వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉండగా.. ఇప్పుడు వీరు విడాకులు తీసుకుంటే.. ఆ అమ్మాయి మానసిక పరివర్తన పై ఈ విషయం ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో వీరికి తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బంధానికి పులిస్టాప్ పెట్టడం తో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

Tags:    

Similar News