• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Throwback: ఏ దర్శకుడైనా...

Throwback: ఏ దర్శకుడైనా తాను చూపించేది ఎవరినీ ప్రభావితం చేయదని చెప్పలేడు: శేఖర్ కమ్ముల

| రాప్తాడు ఘటన తర్వాత సినిమాల్లో హింసపై మరోసారి చర్చ మొదలైంది. సందీప్ రెడ్డి వంగా, రాంగోపాల్ వర్మ సినిమాలకు మద్దతుగా మాట్లాడగా.. దర్శకుడు శేఖర్ కమ్ముల పాత వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రక్తపాతం, గన్ కల్చర్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, దర్శకులు సినిమాలు తీసేటప్పుడు సమాజంపై వాటి ప్రభావాన్ని కూడా ఆలోచించాలని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో శేఖర్ కమ్ముల మాటలకు పలువురు మద్దతు తెలుపుతున్నారు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-07 05:53 GMT

రాప్తాడు ఘటన తర్వాత సినిమాలపై మరోసారి ఎన్నో విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా హింసను చూపించే సినిమాలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దర్శకులు సందీప్ రెడ్డి వంగా, రాంగోపాల్ వర్మ వంటి వారు సినిమాలకు మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళకి విభిన్నంగా దర్శకుడు శేఖర్ కమ్ముల గతంలో చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి బాలికపై జరిగిన దారుణ దాడి అందరినీ కలచివేసింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో యానిమల్ సినిమా పై కూడా చర్చ మొదలైంది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాలోని కొన్ని హింసాత్మక సన్నివేశాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే ప్రతి ఘటనకు సినిమాలను బాధ్యులుగా చేయడం సరికాదని సందీప్ రెడ్డి వంగా స్పందించారు.

సినిమాల విజయాన్ని చూసి ఓర్వలేని కొందరు ఇలాంటి విషాద ఘటనలను కూడా తమకు అనుకూలంగా ఉపయోగించు కుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. బాధితులకు అండగా నిలబడటం కంటే సినిమాలపై విమర్శలు చేయడానికి కొందరు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు రాం గోపాల్ వర్మ కూడా సినిమాలకు మద్దతుగా నిలిచారు.

ఇదిలా ఉంటే.. ఈ విషయానికి కౌంటర్ గా ఇప్పుడు శేఖర్ కమ్ముల పాత వీడియో షేర్ చేస్తున్నారు సినీ అభిమానులు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. "ఏ దర్శకుడైనా తాను చూపించేది ఎవరినీ ప్రభావితం చేయదని చెప్పలేడు. రక్తపాతం, గన్ కల్చర్ తగ్గించాలి. ఎందుకంటే ఇలాంటి హింసాత్మక ఆలోచనలు పిల్లల మనసుల్లో తెలియకుండానే చేరుతాయి. సినిమాలో హీరో గన్ పట్టుకున్నాడని చూసి పిల్లలు కూడా గన్ పట్టుకోవాలని అనుకోవచ్చు. కాబట్టి దర్శకులు ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు సమాజంపై వాటి ప్రభావం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి" అని చెప్పారు.

నిజానికి శేఖర్ కమ్ముల చెప్పిన మాటల్లో ఆలోచించాల్సిన విషయం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొంతమంది సందీప్ రెడ్డి మాటలు మద్దతు పలకగా.. మరి కొంతమంది శేఖర్ కమ్ముల మాటలను సపోర్ట్ చేస్తున్నారు.

అయితే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నప్పటికీ.. శేఖర్ కమ్ముల ఈ వ్యాఖ్యలు చాలా సంవత్సరాల క్రితమే చేశారు. ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఆయన పాత మాటలను నెటిజన్లు మళ్లీ వైరల్ చేస్తున్నారు.

Tags:    
  • shekharkammula 
  • sandeepreddyvanga 
  • rapthaduincident 
  • filmviolence 
  • telugucinema 

Similar News

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

పవన్‌తో మరో సినిమా.. దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా?

2026-11-14 16:30 GMT

ఏడాదిలో నాలుగు... శర్వా రికార్డ్‌ అయ్యేనా?

2026-11-14 16:27 GMT

Copyright @2026

Powered by Blink CMS