వావ్.. ఇదేం సినిమా రా అనుకుంటారు
కుబేర స్టోరీ అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అని, ముంబైలో జరిగే ఈ కథ నార్త్ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అవుతుందని ఆయన చెప్పారు.;
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న తాజా సినిమా కుబేర. ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల తన జానర్ ను మార్చి కొత్త జానర్ ను ట్రై చేశాడు. ధనుష్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రమోషన్స్ లో భాగంగా శేఖర్ కమ్ముల పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.
కుబేర కోసం కావాలని ప్లాన్ చేసి జానర్ ను మార్చడం లాంటిదేమీ జరగలేదని, రాసుకున్న కథకు తగ్గట్టుగా దాన్ని ఎలా తీస్తే బావుంటుందో అలా చేశానని, కుబేర సినిమా చూసినప్పుడు ఆడియన్స్ అందరూ వావ్.. ఇదేం సినిమారా అనుకుంటారని, కథలో భాగంగా కొన్ని పొలిటికల్ అంశాలు కూడా కనిపిస్తాయని, అలాగని మూవీ మొత్తం రాజకీయాలే ఉండవని అన్నారు.
అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయాలి కాబట్టి మనం కూడా చేసేయాలి అనుకుని కుబేరను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించలేదని, కుబేర స్టోరీ అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అని, ముంబైలో జరిగే ఈ కథ నార్త్ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అవుతుందని ఆయన చెప్పారు. ఈ సినిమాలో ధనుష్ పాత్రలో మరొకరిని ఊహించుకోలేమని, ఆయన ఇలాంటి కథను ఒప్పుకుని చేయడమే మెచ్చుకోవాల్సిన విషయమని, కుబేర కోసం ఆయన చాలా కష్టపడ్డాడని, ధనుష్ మాత్రమే ఇలాంటి క్యారెక్టర్ ను చేయగలరని సినిమా చూశాక అనిపస్తుందని, ధనుష్ డైరెక్టర్ కూడా అవడంతో అతనికి నెరేషన్ ఇచ్చేటప్పుడు ఎంతో భయపడ్డానని శేఖర్ కమ్ముల తెలిపారు.
స్టార్ కాస్టింగ్ తో సినిమా చేయడం వల్లే కుబేర సినిమా షూటింగ్ పూర్తవడానికి లేటైందని, పైగా ఎక్కువ షూటింగ్ ముంబైలోనే జరగడం కూడా సినిమా ఆలస్యానికి కారణమని, ఇక్కడ లాగా అక్కడ పర్మిషన్లు వెంటనే దొరకవని ఆయన అన్నారు. ఇప్పుడు స్టార్లతో సినిమా చేశానని, తర్వాతి సినిమాలు కూడా అలానే చేయాలనుకోవడం లేదని, పాన్ ఇండియా అనేది తనకు చాలా కష్టమని, అదే రూట్ లో కంటిన్యూ అవడం అనుకున్నంత ఈజీ కాదని అన్నారు. ఈ సందర్భంగా ఎంతో కాలంగా లీడర్2 పై వస్తున్న వార్తల గురించి కూడా ఆయన స్పందించారు. లీడర్ కు సీక్వెల్ చేయొచ్చని, కానీ అప్పటికీ ఇప్పటికీ రాజకీయాలు చాలా మారాయని, ప్రజలే మారిపోయారనిపిస్తుందని, నానితో సినిమా చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ దానికి చాలా టైమ్ పడుతుందని కమ్ముల తెలిపారు.