'లీడ‌ర్ 2' తీస్తే క‌మ్ములా ప్ర‌శ్నించేది ప్ర‌జ‌ల‌నా?

ఇదే సినిమా నేటి జ‌న‌రేష‌న్ లో తీసి ఉంటే ఇంకా గొప్ప విజయం సాధించేది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం జరుగుతుంది.;

Update: 2025-06-19 10:37 GMT

పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో శేఖ‌ర్ క‌మ్ములా తెర‌కెక్కించిన 'లీడ‌ర్' అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. విమ‌ర్శ‌కులు మెచ్చిన గొప్ప చిత్రంగా నిలిచింది. అవినీతి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌పై క‌మ్ములా సంధించిన బాణ‌మిది. రాజ‌కీయాలు ఎలా ఉంటాయి? అక్క‌డ జ‌రిగే అవనీతి ఏ స్థాయిలో ఉంటుంది? ల‌క్ష‌ల కోట్లు ఎలా సంపాదిస్తారు? చ‌ట్టం ధ‌న‌వంతుడి విష‌యంలో ఎలా ప‌నిచేస్తుంది? పేద వాడి ప‌క్షాన ఎలా నిల‌బ డుతుంది? వంటి అంశాల‌ను స్పృశిస్తూ తీసిన గొప్ప చిత్ర‌మిది.

ఇదే సినిమా నేటి జ‌న‌రేష‌న్ లో తీసి ఉంటే ఇంకా గొప్ప విజయం సాధించేది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం జరుగుతుంది. కానీ క‌మ్ములా ఏనాడు క్లారిటీ ఇవ్వ‌లేదు. తొలిసారి సీక్వెల్ పై ఆయ‌న స్పందించారు. లీడ‌ర్ సీక్వెల్ తీయోచ్చు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ క‌థ‌పైనా త‌న‌కు ఓ స్ప‌ష్ట‌త ఉంద‌న్నారు. అయితే అప్ప‌టికీ ఇప్ప‌టికీ రాజ‌కీయాల్లో చాలా మార్పులొ చ్చాయ‌న్నారు. త‌న‌కైతే దేశ ప్ర‌జ‌లే మారిపోయార‌నిపిస్తుంద‌న్నారు.

వాళ్ల అభిరుచుల్ని జాగ్ర‌త్తగా ప‌ట్టుకుని తీయాల్సిన క‌థ‌గా అభిప్రాయ ప‌డ్డారు. శేఖ‌ర్ క‌మ్ములా మాట‌ల్ని బ‌ట్టి ఈసారి ఆయ‌న పొలిటిక‌ల్ స్టోరీ తీస్తే ప్ర‌జ‌ల కోణంలో ఉంటుంద‌ని తెలుస్తోంది. 'లీడ‌ర్' సినిమా తీసిన స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో లేదు. అప్ప‌ట్లో ప్రజా సమాస్య‌లను ప్ర‌భుత్వానికి ఎలా తెలియ జేయాలో కూడా తెలిసేది కాదు. నేడు ఎంతో ఆధునిక యుగంలో ఉన్నాం. స‌మ‌స్య ఏదైనా సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌భుత్వానికి చేరుతుంది.

సంచ‌ల‌న‌మైన విష‌య‌మైలే ప్ర‌భుత్వం కూడా అంతే విధిగా స్పందిస్తుంది. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక కూడా అంతే ఓపెన్ గా వ్య‌క్త‌మ‌వుతుంది. ప్ర‌జ‌ల వైపు నుంచి త‌ప్పిదాలు క‌నిపిస్తున్నాయి. వాటిని కూడా ఎదురు ప్ర‌శ్నించే ప‌రిస్థితి ఉంది. ఇలాంటి అంశాల‌తో క‌మ్ములా 'లీడ‌ర్ 2' రాస్తే అదిరిపోతుంది.

Tags:    

Similar News