సింగిల్ గా ఉంటావా? రిస్క్ తీసుకుంటావా?
తాజాగా ఓ మీట్ లో మొదటి వివాహం అనుభవాలు పంచుకున్నారు. `నీకు భర్త, స్నేహితుడు, అన్న, చెల్లి ఎవరి అవసరం లేదు. నీకు నువ్వు చాలు అని ఎవరూ నాతో అనలేదు.;
బాలీవుడ్ నటి షెఫాలీ షా పరిచయం అవసరం లేని పేరు. `ఢిల్లీ క్రైమ్`, `డార్లింగ్స్`, `జల్సా`, `హ్యూమన్` లాంటి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ కు బాగా సుపరిచితమే. `ఢిల్లీ క్రైమ్` వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు దక్కించు కున్నారు. ప్రస్తుతం వృత్తిగత జీవితం సంతోషంగా సాగిపోతుంది. వ్యక్తిగత జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. భార్య ,భర్త పిల్లలు అంటూ సంతోషంగానే ఉన్నారు. కానీ ఈమె జీవితంలో కూడా మొదటి పెళ్లి పెటాకులైంది. తొలుత బుల్లి తెర నటుడు హర్ష్ చయ్యాను వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవడలేదు.
పెళ్లైన కొన్నాళ్లకే విడాకులతో వేరయ్యారు. అదే ఏడాది దర్శకుడు విపుల్ అమృత్ లాల్ ను రెండవ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. తాజాగా ఓ మీట్ లో మొదటి వివాహం అనుభవాలు పంచుకున్నారు. `నీకు భర్త, స్నేహితుడు, అన్న, చెల్లి ఎవరి అవసరం లేదు. నీకు నువ్వు చాలు అని ఎవరూ నాతో అనలేదు. మంచి రిలేషన్ లో ఉంటే అంతకన్నా సంతోషకరమైన జీవితం మరోకటి ఉండదు. కానీ ఆ బంధం సరిగ్గా లేకపోతే గనుక చాలా ఇబ్బందులు తప్పవు. అలాంటి రిలేషనప్ షిప్ ని కొనసాగించాలా? వద్ద? అని డైలమా నుంచి తొందరగా బయటకు రాలేం అన్నారు.
`వచ్చేలోపు చాలా జీవితం గడిచిపోతుంది. భరించడం..సహించడం కష్టమనిపిస్తుంది. అదీ ప్రాణాంతకం కూడా కావొచ్చు. అలాంటి సందర్భాలన్నీ మొదటి భర్త కారణంగా చూసానన్నారు. సరిగ్గా అదే సమ యంలో తన స్నేహితురాలు నిన్ను ప్రేమించే వ్యక్తి వచ్చాడు కాబట్టి జీవితం సంతోషంగా సాగిపోతుందిప్పుడు? ఒకవేళ అలాంటి వ్యక్తి రాకపోతే రిస్క్ తీసుకుంటావా? అని అడిగింది. దానికి తాను కచ్చితంగా రిస్క్ తీసుకుంటానని బధులిచ్చా నన్నారు. జీవితాన్ని ఒంటరిగానైనా గడుపుతాను గానీ విలువ లేని చోట మాత్రం ఉండలేనన్నారు.
అయితే ఆ మధ్య అమృత్ పాల్ తో కూడా విడిపోతున్నారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఖండించారు. 25 ఏళ్ల ధాంప్యత జీవితాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో వారి జీవితం ఎంతో సంతోషంగా ఉందని క్లారిటీ వచ్చింది.
దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. తమ పెళ్లి కూడా అందరిలాగే ఎత్తు పల్లాల మధ్యలో జరిగిందన్నారు. గడిచిన 25 ఏళ్లుగా కలిసి డ్యాన్స్ చేస్తున్నాం. కొన్నిసార్లు ఒకే తాళంలో,ఇంకొన్నిసార్లు భిన్నంగా ప్రయత్నిస్తుంటాం. ఒక్కోసారి ఒకరి కాలిపై మరొకరు కాలు వేసి తడబడతాం. కానీ నవ్వుకుంటూనే ఒకరినొకరం మళ్లీ లేచి నుంచుంటాం అని ప్రచారాన్ని ఖండించారు.