టైమ్ మెషీన్‌తో సంక్రాంతిపై దాడి.. శర్వానంద్ భారీ గేమ్ స్టార్ట్!

టైమ్ మెషీన్ అనే సైన్స్ ఫిక్షన్ ఆలోచనను కేవలం టెక్నిక‌ల్ విన్యాసాలకే పరిమితం చేయకుండా, వినోదాత్మక కథనంగా మార్చగలిగితే అది ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.

Update: 2026-08-13 06:16 GMT

తెలుగు కమర్షియల్ సినిమాల్లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కొత్తది కాదు. అయితే ఆ కాన్సెప్ట్‌ను ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా, అందులోనూ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, రిలేషన్‌షిప్ డ్రామాతో కలిపి చెప్పడం మాత్రం సవాలుతో కూడుకున్న ప్రయత్నంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు శర్వానంద్ చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్‌పై డిస్క‌ష‌న్ కూడా ఇదే యాంగిల్ లో సాగుతోంది.

టైమ్ మెషీన్ అనే సైన్స్ ఫిక్షన్ ఆలోచనను కేవలం టెక్నిక‌ల్ విన్యాసాలకే పరిమితం చేయకుండా, వినోదాత్మక కథనంగా మార్చగలిగితే అది ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కామెడీకి టైమ్ ట్రావెల్ జోడిస్తే వచ్చే పరిస్థితులు, పాత్రల మధ్య అపార్థాలు, గతం- వర్తమానం మధ్య జరిగే సంఘర్షణలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వగలవు. అదే సమయంలో ఫ్యామిలీ బాండింగ్స్, త‌ల్లీపిల్ల‌ల అనుబంధం, కోల్పోయిన అవకాశాలను తిరిగి అందుకోవాలనే ఎమోష‌నల్ అంశాలను కూడా ఈ జానర్‌లో సహజంగా మిళితం చేసే అవకాశం ఉంది.

తెలుగు ఆడియ‌న్స్ కమర్షియల్ సినిమాల్లో కొత్త కాన్సెప్ట్‌లను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని గత కొన్నేళ్లలో వచ్చిన పలు సినిమాలు నిరూపించాయి. స్క్రీన్ ప్లే వినోదాత్మకంగా ఉండి, ఎమోషనల్ కనెక్ట్ బలంగా ఉంటే సైన్స్ ఫిక్షన్ అంశాలు కూడా పెద్ద అడ్డంకిగా మారవు. అందుకే టైమ్ ట్రావెల్‌ను పూర్తిగా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రేమ్‌లో ఎలా చూపిస్తారన్నదే ఈ ప్రాజెక్ట్‌పై ప్రధాన ఆసక్తిగా మారుతోంది.

ఇక ఈ సినిమా కోసం శర్వానంద్ కొత్త లుక్ లో క‌నిపించ‌డానికి స్పెష‌ల్ గా ప్రిపేర్ అవుతున్నట్లు వినిపించడం కూడా ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. కెరీర్‌లో ఇప్పటికే విభిన్న పాత్రలు చేసిన ఆయన, ఈసారి మరో ట్రాన్స్‌ఫర్మేషన్ దశలోకి వెళ్తున్నారనే డిస్క‌ష‌న్ జరుగుతోంది. పాత్ర వయసు, టైమ్ ట్రావెల్ ఇంపాక్ట్, లేదా కథలోని భిన్న టైమ్‌లైన్లకు అనుగుణంగా లుక్ డిజైన్ చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మరో ఇంట్రెస్టింగ్ అంశం ఈ సినిమా సంక్రాంతి 2027ను టార్గెట్ చేయ‌డం. ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుగానే రిలీజ్ ప్లానింగ్ చేయడ‌మంటే నిర్మాతలు ఈ కథపై నమ్మకంగా ఉన్నారనే సంకేతంగా ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. సంక్రాంతి మార్కెట్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి సమయంలో టైమ్ మెషీన్ నేపథ్యంతో కామెడీ, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిసిన సినిమా వస్తే, అది తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఈ జానర్‌కు కొత్త దిశను చూపించే అవకాశాన్ని కొట్టిపారేయలేము.

Tags:    

Similar News