శ్రీను వైట్ల మళ్లీ మెషిన్ కామెడీ పట్టుకున్నాడా?

హీరో శర్వానంద్ ట్రాక్ రికార్డ్ గమనిస్తే ఆయన గతంలోనే 'ఒకే ఒక జీవితం' సినిమాతో టైమ్ ట్రావెల్ జానర్ ను టచ్ చేశారు.

Update: 2026-08-13 18:06 GMT

శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ మీద ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా పాయింట్ కి సంబంధించి బయటకు వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో టైమ్ మిషన్ కు సంబంధించిన ఒక ఎలిమెంట్ ఉండబోతోందనే టాక్ గట్టిగా ప్రచారంలోకి వచ్చింది. అయితే మేకర్స్ నుంచి దీనిపై ఎలాంటి అఫీషియల్ ప్రమోషనల్ అప్డేట్ రాలేదు కాబట్టి, ఇది ప్రాపర్ సైన్స్ ఫిక్షన్ కథా లేక కథలో ఒక భాగమా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

హీరో శర్వానంద్ ట్రాక్ రికార్డ్ గమనిస్తే ఆయన గతంలోనే 'ఒకే ఒక జీవితం' సినిమాతో టైమ్ ట్రావెల్ జానర్ ను టచ్ చేశారు. ఆ ప్రాజెక్ట్ లో మదర్ సెంటిమెంట్ తో పాటు ఎమోషనల్ జోన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ శ్రీను వైట్ల ప్రాజెక్ట్ లోనూ టైమ్ మిషన్ అనే పాయింట్ బయటకు రావడంతో, శర్వా మరోసారి అదే జానర్ లోకి అడుగు పెడుతున్నాడా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మొదలైంది.

అయితే గతంలో ఎమోషన్ కు స్కోప్ ఉంటే, ఈసారి దర్శకుడి మార్కు ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందేమో అనే ఆలోచన కూడా వస్తోంది. మరోవైపు శ్రీను వైట్ల పాస్ట్ ఫిలిమ్స్ ను ఒకసారి పరిశీలిస్తే ఆయన శైలికి తగ్గట్టుగా విభిన్నమైన కామెడీ ట్రాక్స్ ను డిజైన్ చేయడంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ను అమాయకుడిని చేసి "డ్రీమ్ మెషిన్" అనే ఒక ఫేక్ కాన్సెప్ట్ ను క్రియేట్ చేసి థియేటర్లలో పెద్ద ఎత్తున నవ్వులు పూయించారు. ఆ సీన్స్ అప్పట్లో సినిమాకి మెయిన్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచాయి.

ఇప్పుడు శర్వా తో కూడా నిజంగానే ప్రాపర్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన టైమ్ మిషన్ కథ ఉంటుందా, లేదంటే బాద్ షా తరహాలోనే ఏదైనా ఫిక్షనల్ సెటప్ లేదా కామెడీ డివైజ్ క్రియేట్ చేసి దాని చుట్టూ ఫన్ నడిపిస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. శ్రీను వైట్ల మార్కు ప్రసెంట్ చేసే పద్ధతి తెలిసిన వాళ్లు మాత్రం, ఈ పాయింట్ ను సీరియస్ కథగా కాకుండా తన స్టైల్ లోనే ఎంటర్‌టైన్మెంట్ కు వాడుకునే ఛాన్స్ ఉందేమో అనుకుంటారు.

ఒకవేళ నిజంగానే కామెడీ డివైజ్ చుట్టూ కాకుండా ప్రాపర్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నడిచినా, శ్రీను వైట్ల శైలిలో సిట్యువేషనల్ హ్యూమర్ కు మంచి స్కోప్ దొరికే అవకాశం ఉంటుంది. శర్వానంద్ టైమింగ్ కి, శ్రీను వైట్ల కామెడీ ఐడియాలకు తోడు ఈ కొత్త బ్యాక్ డ్రాప్ కూడా తోడైతే అవుట్ పుట్ డిఫరెంట్ గా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో నిజంగానే ఏదైనా టైమ్ ట్రావెల్ ఎలిమెంట్ ఉందా లేక శ్రీను వైట్ల తన పాత ఫార్ములాలోనే ఏదైనా ఫేక్ కన్ఫ్యూజన్ డ్రామా సెట్ చేశారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News