శర్వాకు ఆ అంశం కలిసొచ్చేలా ఉందే
2 గంటల 25 నిమిషాల రన్ టైమ్ అంటే ఈ విషయం సినిమాకు కలిసొచ్చే అంశమే. కంటెంట్ కాస్త ఎంగేజింగ్ గా ఉంటే ఈ రన్ టైమ్ తో ఈజీగా లాగేయొచ్చు.;
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ హీరోగా నారీ నారీ నడుమ మురారి అనే సినిమాతో సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జనవరి 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా, ముందు రోజు అంటే జనవరి 14 సాయంత్రం నుంచే ఈ సినిమాకు ప్రీమియర్లను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. అందులో భాగంగానే మీడియా ముందుకొచ్చి వరుస ఇంటర్వ్యూలిస్తున్నారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న నారీ నారీ నడుమ మురారి
రిలీజ్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ ను పూర్తి చేసుకున్న నారీ నారీ నడుమ మురారి ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ను అందుకుంది. సెన్సార్ తర్వాత ఈ సినిమా 145 నిమిషాల రన్ టైమ్ ను ఫిక్స్ చేసుకుంది.
క్యామియో చేస్తున్న శ్రీ విష్ణు
2 గంటల 25 నిమిషాల రన్ టైమ్ అంటే ఈ విషయం సినిమాకు కలిసొచ్చే అంశమే. కంటెంట్ కాస్త ఎంగేజింగ్ గా ఉంటే ఈ రన్ టైమ్ తో ఈజీగా లాగేయొచ్చు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు ఈ మూవీలో ఓ క్యామియో చేస్తున్నారు.
త్వరలోనే ట్రైలర్
కాగా ఇప్పటికే నారీ నారీ నడుమ మురారి సినిమా నుంచి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు రన్ టైమ్ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశమైంది. మేకర్స్ త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మరియు అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లి బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.