శర్వా పెద్ద సినిమా.. ఓ క్లారిటీ వచ్చింది
శర్వానంద్ నటిస్తున్న ‘భోగి’ ముందు అనుకున్న డేట్‌కు రావడం లేదు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని టీమ్ చెప్పేసింది.
శర్వానంద్ నటిస్తున్న ‘భోగి’ ముందు అనుకున్న డేట్‌కు రావడం లేదు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని టీమ్ చెప్పేసింది. అయితే సినిమా ఎందుకు వెనక్కి వెళ్లిందనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ ఆలస్యం వల్ల కాదు.. వీఎఫ్ఎక్స్ పనులకు ఇంకాస్త టైమ్ కావడంతో రిలీజ్‌ను మార్చాల్సి వచ్చిందని తెలిపారు. సంపత్ నంది డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా శర్వా కెరీర్‌లోనే పెద్ద సెటప్‌లో తెరకెక్కుతోంది.
‘భోగి’ పీరియడ్ యాక్షన్ డ్రామాగా సిద్ధమవుతోంది. ఇప్పటికే 30 రోజుల పాటు చేసిన భారీ క్లైమాక్స్ షెడ్యూల్ కూడా పూర్తయింది. అంటే షూటింగ్‌లో పెద్ద భాగం ముందుకు వెళ్లిపోయింది. ఇప్పుడు ఎక్కువ పని పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరే ఉన్నట్లు తెలుస్తోంది. పీరియడ్ వరల్డ్, యాక్షన్ ఎపిసోడ్స్ తెరపై అనుకున్న స్థాయిలో రావాలంటే వీఎఫ్ఎక్స్‌కు ఇంకాస్త సమయం అవసరమని టీమ్ భావిస్తోంది.
శర్వానంద్ గతంలో యాక్షన్ సినిమాలు చేసినా ‘భోగి’ సెటప్ మాత్రం కాస్త వేరుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లలోనే ఆయన లుక్‌ను చాలా రఫ్‌గా మార్చేశారు. చేతిలో ఆయుధం, బ్లాక్ కాస్ట్యూమ్, గడ్డంతో ఉన్న కొత్త పోస్టర్ కూడా సినిమా మూడ్ ఎలా ఉండబోతుందో చెప్పేస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ లుక్‌కు దూరంగా శర్వాను చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
సంపత్ నంది సినిమాల్లో మాస్, యాక్షన్‌కు మంచి స్పేస్ ఉండటం కొత్తేమీ కాదు. కానీ ఈసారి పీరియడ్ బ్యాక్‌డ్రాప్ కూడా కలవడంతో మేకింగ్ దగ్గర పని ఇంకాస్త పెరిగింది. ముఖ్యంగా క్లైమాక్స్ కోసమే నెల రోజుల షెడ్యూల్ పెట్టారంటే ఆ పార్ట్‌ను చిన్నగా ప్లాన్ చేయలేదని అర్థమవుతోంది. రిలీజ్ డేట్ మార్చడం కూడా ఆ పనిలో భాగంగానే కనిపిస్తోంది.
ఇలాంటి సినిమాల్లో డేట్ కోసం తొందరపడి వీఎఫ్ఎక్స్‌ను పూర్తి చేయడం కంటే కొంచెం వెనక్కి వెళ్లడం బెటర్. ఎందుకంటే పీరియడ్ సినిమాల్లో సెట్స్ ఎంత బాగున్నా చివరికి విజువల్ వర్క్ కరెక్ట్‌గా లేకపోతే స్క్రీన్ మీద వెంటనే తేడా తెలిసిపోతుంది. ‘భోగి’ విషయంలో టీమ్ కూడా అదే రిస్క్ తీసుకోకుండా ముందే డేట్‌ను వదిలేసింది. ఇప్పుడు మిగిలింది కొత్త రిలీజ్ డేట్ మాత్రమే. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై శర్వా కూడా మంచి ఆశలు పెట్టుకున్నట్లు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చూస్తే తెలుస్తోంది. ఇక కొత్త డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి.