• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శర్వా అదే స్పీడ్.. మరో...

శర్వా అదే స్పీడ్.. మరో క్రేజీ ఆఫర్

| ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో హీరోగా కొత్త సినిమాకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.

By - Tupaki Desk
Update: 2023-08-24 04:12 GMT

యంగ్ హీరో శర్వానంద్ గత ఏడాది ఒకే ఒక జీవితం సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అంతకు ముందుగా వరుసగా ఆరు డిజాస్టర్స్ ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే నటుడిగా అతను ఏ సినిమాలో కూడా ఫెయిల్ కాలేదు. ఎంచుకున్న కంటెంట్, డైరెక్టర్ మేకింగ్ పరంగానే ఆ సినిమాలన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. ఒకే ఒక జీవితం సినిమాని టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో చేసిన అంతకుమించి ఎమోషన్స్ ని అద్భుతంగా క్యారీ చేయడం మూవీ సక్సెస్ అయ్యింది.

తెలుగు, తమిళ్ రెండు భాషలలో ఈ చిత్రం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. ప్రస్తుతం శర్వానంద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. డార్క్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జై భీమ్ దర్శకుడు టీజే జాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.

ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శర్వానంద్ కనిపిస్తాడంట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో హీరోగా కొత్త సినిమాకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. కళ్యాణ్ రాజశేఖర్ అనే న్యూ టాలెంట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడంట. అతను చెప్పిన స్టోరీ శర్వానంద్ కి బాగా నచ్చడంతో ఒకే చేసాడంట.

మొత్తానికి బ్యాక్ టూ బ్యాక్ ఆరు డిజాస్టర్స్ పడిన కూడా శర్వానంద్ కి మాత్రం దండిగా అవకాశాలు వస్తున్నాయి. దీనికి కారణం నటుడిగా సినిమా సినిమాకి తనని తాను బెస్ట్ గా షోకేస్ చేసుకుంటూ వెళ్లడమే అని చెప్పాలి. ఒకే ఒక జీవితం సినిమాలో కూడా శర్వానంద్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చింది.

ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ లో కమిటైన కొత్త సినిమా త్వరలో అఫీషియల్ గా ఎనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందంట. మరి శ్రీరామ్ ఆదిత్య సినిమాతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్, సితారలో చేయబోయే ప్రాజెక్ట్ శర్వానంద్ ని ఏ మాత్రం బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    
  • Tollywood 
  • Sharwanand 
  • Actor 
  • Newproject 
  • Sitaraentertinments 
  • Kalyanrajshekar 
  • Newdirector 
  • Okeokajeevitham 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS