బోస్ బయోపిక్ కోసం వెయిటింగ్!
శరత్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు. తమిళ నటుడైనా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు.;
శరత్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు. తమిళ నటుడైనా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో తండ్రి , తమ్ముడు, విలన్ పాత్రలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. దాదాపు సౌత్ లో అన్ని భాషల్లోనూ సినిమాలు చేసిన సీరియర్ నటుడు. బాలీవుడ్ కూడా కొన్ని సినిమాలు చేసారు. కానీ అక్కడంత సీరియస్ గా కెరీర్ ని కొనసాగించలేదు. చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాల ప్రయాణం ఆయన సొంతం. రాజకీయంగానూ వివిధ పార్టీల్లో పని చేసారు.
నటుడిగానే ఆ బాధ్యత తీసుకుంటారా:
ఇలా సినిమా -రాజకీయం అంటూ రెండు పడవల ప్రయాణాన్ని దిగ్విజయంగా ముందుకు సాగిస్తున్నారు. అయితే ప్రతీ నటుడుకి కొన్నిడ్రీమ్ రోల్స్ అంటూ ఉంటాయి. అలాంటి రోల్ తనకి ఒకటుందని తాజాగా శరత్ కుమార్ ప్రకటించారు. భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బయోపిక్ లో నటించాలని ఉందంటూ ఆసక్తిని వ్యక్తం చేసారు. ఎప్పటి నుంచో బోస్ బయోపిక్ లో నటించాలని ఆశ ఉన్నా? ఆ అవకాశం ఇంత వరకూ రాలేదన్నారు. అయితే నటుడిగానే ఆ బాధ్యత తీసుకుంటారా? దర్శకత్వం వైపు కూడా వెళ్తారా? అన్నది చూడాలి.
దర్శక, నిర్మాతగానూ అనుభవం:
శరత్ కుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు. గాయకుడిగా, నిర్మాతగానూ సేవలందించారు. అయితే ఆ రెండు శాఖలపై సీరియస్ గా పని చేయలేదు. నటుడిగా బిజీగా ఉండటంతో? అక్కడే దృష్టి పెట్టి పనిచేసారు. అలాగే దర్శకుడిగా కూడా ఓ సినిమాకు పని చేసారు. 2015 లో `సందామారుతం` అనే సినిమాను డైరెక్టర్ చేసారు. కానీ ఆ తర్వాత దర్శకత్వం కొనసాగించలేదు. తాజాగా బోస్ బయోపిక్ పై ఆశపడిన నేపథ్యంలో దర్శకత్వం బాధ్యతలు కూడా తానే తీసుకుంటారేమో చూడాలి.
బోస్ ఇమేజ్ కి తగ్గ నటుడేనా?
అయితే నేతాజీ బయోపిక్ లో ఓ పెద్ద హీరో నటిస్తే బాగుంటుందన్నది నెటి జనుల అభిప్రాయం. ఇప్పటికే శరత్ కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్నింగ్ తీసుకున్న నేపథ్యంలో బోస్ పాత్రకు ఆయన సరితూగే నటుడు కాదన్నది పలువురి అభిప్రాయం. బోస్ ఇమేజ్ తో పని లేకుండా ఆయన కథలో నటించిన నటులు కొంత మంది ఉన్నారు. కానీ ఆ చిత్రాలేవి పెద్దగా హైలైట్ అవ్వలేదు. శరత్ కుమార్ గనుక ఛాన్స్ తీసుకుంటే? ఓ పెద్ద ప్రాజెక్ట్ గా ప్రతిష్టాత్మకంగా తీసుకు రాగలగాలి.