శంక‌ర్ ఆ గోల్డెన్ ఛాన్స్ ను అయినా వాడుకుంటాడా?

పైగా అప‌రిచితుడు లోని స్ట్రాంగ్ సోష‌ల్ మెసేజ్ కు ఈ జెన‌రేష‌న్ ఆడియ‌న్స్ కూడా బాగా క‌నెక్ట్ అవుతారు. అలాంటి స‌బ్జెక్టు అది.;

Update: 2025-08-31 05:29 GMT

ఇండ‌స్ట్రీలో ఎవ‌రికెప్పుడు స్టార్ స్టేట‌స్ వ‌స్తుందో ఎవ‌రెప్పుడు ప‌డిపోతారో చెప్ప‌లేం. ఒకే ఒక్క సినిమాతో ఎంతో మంది జీవితాలు మారిపోతాయి. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎంతో క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌లు పెట్టుకుని రామ్ చ‌ర‌ణ్ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ అయిన శంక‌ర్ తో గేమ్ ఛేంజ‌ర్ అనే సినిమా చేస్తే అది డిజాస్ట‌ర్ అవ‌డంతో శంక‌ర్ కు మ‌రో ఛాన్స్ రావ‌డం లేదు.

శంక‌ర్ ముందు గోల్డెన్ ఛాన్స్

గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత శంక‌ర్ కు మ‌రో స్టార్ హీరోను ఒప్పించ‌డం చాలా క‌ష్ట‌మైంది. అయిన‌ప్ప‌టికీ శంక‌ర్ ముందు ఓ గోల్డెన్ ఛాన్స్ ఉంది. గ‌త కొన్ని సినిమాలుగా ఫామ్ లో లేని శంక‌ర్ అప‌రిచితుడు సినిమాకు సీక్వెల్ ను తీస్తే ఆ సినిమాతో తిరిగి కంబ్యాక్ అయ్యే అవ‌కాశాలున్నాయి. కొన్నేళ్ల ముందు రిలీజైన అప‌రిచితుడు సినిమాకు మంచి క్రేజ్ ఉంది.

విక్ర‌మ్ కు అత‌నే స‌రైన ఛాయిస్

పైగా అప‌రిచితుడు లోని స్ట్రాంగ్ సోష‌ల్ మెసేజ్ కు ఈ జెన‌రేష‌న్ ఆడియ‌న్స్ కూడా బాగా క‌నెక్ట్ అవుతారు. అలాంటి స‌బ్జెక్టు అది. అలాంటి సినిమాకు సీక్వెల్ ను చేస్తే ఆడియ‌న్స్ కు శంక‌ర్ పై న‌మ్మ‌కం ఏర్ప‌డే ఛాన్సుంది. పైగా శంక‌ర్ ఇప్పుడున్న ప‌రిస్థితుల‌కు స్టార్ హీరో కావాలంటే విక్ర‌మ్ క‌రెక్ట్ ఛాయిస్. అప‌రిచితుడులో న‌టించిన హీరో అత‌నే కాబ‌ట్టి ఈ సినిమా కూడా అత‌ను చేయ‌డ‌మే క‌రెక్ట్.

ఆ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి

మ‌రోవైపు విక్ర‌మ్ కు కూడా గ‌త కొన్ని సినిమాలుగా ఆయ‌నకు చెప్పుకోద‌గ్గ హిట్ ద‌క్క‌లేదు. అత‌ని మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. ఈ నేప‌థ్యంలో శంక‌ర్- విక్ర‌మ్ కాంబినేష‌న్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశ‌ముంది. విడి విడిగా ఇద్ద‌రూ స‌క్సెస్‌లో లేక‌పోయినా, వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో గ‌తంలో వ‌చ్చిన సినిమా మంచి హిట్ అవ‌డంతో ఈ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ అయితే మాత్రం మొద‌టి నుంచే ఆ ప్రాజెక్టుపై మంచి బ‌జ్ ఏర్ప‌డే ఛాన్సుంది. అటు శంక‌ర్ తో పాటూ ఇటు విక్ర‌మ్ కు కూడా ఇది గోల్డెన్ ఛాన్సే. కాక‌పోతే శంక‌ర్ ఇండియన్2 లో చేసిన త‌ప్పుల్ని స‌రిదిద్దుకోవ‌డంతో పాటూ క‌థ‌పై కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే సులభంగా కం బ్యాక్ ఇవ్వొచ్చు. మ‌రి ఈ గోల్డెన్ ఛాన్స్ ను అయినా శంకర్ స‌రిగ్గా వాడుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News