అట్లీ అసిస్టెంట్ తో.. శంకర్ తనయుడు..?

ఇక ఇప్పుడు అర్జిత్ శంకర్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమాల మీద ఆసక్తితో అతను ఫిల్మ్ క్రాఫ్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడట.;

Update: 2025-08-07 06:47 GMT

సినీ పరిశ్రమలో వారసుల హంగామా తెలిసిందే. ఐతే వాళ్లకు ఎంట్రీ ఈజీగా దొరుకుతుందేమో కానీ ఇక్కడ సక్సెస్ అవ్వడం మాత్రం వాళ్ల టాలెంట్ ని బట్టి మాత్రమే ఉంటుంది. అన్నిచోట్ల నెపొటిజం అనేది ఉన్నా కూడా కేవలం సినీ పరిశ్రమలోనే నెపొటిజం పెంచి పోషిస్తున్నట్టు చెబుతుంటారు. అయితే అనే వాళ్లు ఏమనుకున్నా వచ్చే వాళ్లు వస్తున్నారు.. సక్సెస్ కొట్టి కొనసాగిస్తున్నారు.. సెట్ అవ్వదని సైడ్ అవుతున్న వారు ఉన్నారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ తనయుడు త్వరలో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.

సౌత్ ఇండియా దిగ్గజ దర్శకుడు..

సౌత్ ఇండియా దిగ్గజ దర్శకుడు.. ఇప్పుడు కాదు ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్ శంకర్. ఈమధ్య ఆయన సరైన ఫాంలో లేరు కానీ ఒకప్పుడు శంకర్ సినిమా వస్తుంది అంటే మిగతా వాళ్లంతా సైడ్ అవ్వాల్సిందే అనే క్రేజ్ తెచ్చుకున్నాడు. శంకర్ గేమ్ ఛేంజర్ ముందు వరకు తమిళ హీరోలతోనే సినిమాలు చేశాడు. గేమ్ ఛేంజర్ తో తెలుగు హీరోతో వర్క్ చేశాడు.

ఇండియన్ 2 ఫ్లాప్ అయినా గేమ్ ఛేంజర్ ట్రాక్ లోకి తెస్తుందని అనుకోగా అది కూడా మిస్ ఫైర్ అయ్యింది. ఐతే శంకర్ డైరెక్టర్ గా నెక్స్ట్ ఏం చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈలోగా శంకర్ తనయుడు అర్జిత్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఇప్పటికే శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఈమధ్యనే ఆమె తెలుగులో భైరవం సినిమా చేసింది.

అర్జిత్ శంకర్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ..

ఇక ఇప్పుడు అర్జిత్ శంకర్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమాల మీద ఆసక్తితో అతను ఫిల్మ్ క్రాఫ్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడట. యాక్టింగ్ కోర్స్ కూడా పూర్తి చేశాడని టాక్. త్వరలోనే అర్జిత్ తొలి సినిమా మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను అట్లీ దగ్గర పనిచేసిన డైరెక్టర్ ఒకరు పనిచేస్తున్నారట. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ వస్తుందని తెలుస్తుంది.

అర్జిత్ శంకర్ తండ్రిలానే డిఫరెంట్ కథలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు. అంతేకాదు తనయుడితో శంకర్ సినిమా చేస్తే ఆ మూవీ రేంజ్ వేరేలా ఉంటుందని అంటున్నారు. శంకర్ ప్రస్తుతం ఇండియన్ 3 రిలీజ్ చేసే పనుల్లో ఉన్నారు. ఆయన నెక్స్ట్ సినిమా మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు. అట్లీ దగ్గర పనిచేశాడు కాబట్టి కచ్చితంగా అర్జిత్ తొలి సినిమాతో ఒక మార్క్ సెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం అట్లీ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. జవాన్ తర్వాత అతను అల్లు అర్జున్ తో సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు.

Tags:    

Similar News