ఆ స్టార్ హీరోతో ప్రేమ‌లో ప‌డాల‌నుంది

గ‌త కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న షాలినీ తాజాగా ఓ చిట్ చాట్ లో త‌న‌కు ఓ స్టార్ హీరో తో క‌లిసి న‌టించాల‌నున్నట్టు తెలిపింది.;

Update: 2025-04-11 22:30 GMT

అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన షాలినీ పాండే ఫ‌స్ట్ మూవీతోనే న‌టిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమాలో షాలినీని చూసి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోతుంద‌నుకున్నారంతా. కానీ షాలినీ పాండేకి మాత్రం అనుకున్నంతగా ఆఫ‌ర్లు రాలేదు. సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా షాలినీ నెట్టింట ఫోటోలు షేర్ చేస్తూ అంద‌రికీ ట‌చ్ లోనే ఉంది.

అర్జున్ రెడ్డి త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేస్తుంద‌నుకున్న షాలినీ దాని త‌ర్వాత అప్పుడ‌ప్పుడు ఓ సినిమా చేసింది కానీ ఎక్కువ మొత్తంలో అయితే సినిమాల్లో న‌టించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం హిందీలో సినిమాలు చేస్తూ అక్క‌డ స‌రైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలినీ పాండే 2022లో జ‌యేష్ బాయ్ జోర్దార్ సినిమాలో ర‌ణ‌వీర్ సింగ్ తో క‌లిసి న‌టించి అంద‌రితో మంచి మార్కులు వేయించుకుంది.

గ‌త కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న షాలినీ తాజాగా ఓ చిట్ చాట్ లో త‌న‌కు ఓ స్టార్ హీరో తో క‌లిసి న‌టించాల‌నున్నట్టు తెలిపింది. ఒక్క‌రోజైనా ఆ హీరోతో క‌లిసి వ‌ర్క్ చేయాల‌నుకుంద‌ని త‌న మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టింది షాలినీ. ఆ స్టార్ హీరో మ‌రెవ‌రో కాదు బాలీవుడ్ అంద‌గాడు ర‌ణ్‌బీర్ క‌పూర్.

ర‌ణ్‌బీర్ కళ్ల‌ల్లో ఏదో మ్యాజిక్ ఉంద‌ని, అత‌డిలో ఏదో మాయ ఉంద‌నిపిస్తుంద‌ని, స్క్రీన్ పై అత‌నితో క‌లిసి న‌టించాల‌నుంద‌ని, అత‌నితో క‌లిసి ప్రేమ‌లో ప‌డ‌టానికి ఎంతగానో ఎదురుచూస్తున్న‌ట్టు షాలినీ చెప్పుకొచ్చింది. మ‌రి ర‌ణ్‌బీర్ తో క‌లిసి న‌టించాల‌నే షాలినీ కోరిక తీరుతుందో లేదో చూడాలి. ప్ర‌స్తుతం ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఇడ్లీ క‌డై సినిమాలో షాలినీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

త‌న‌ను చాలా మంది ఆలియా భ‌ట్ తో పోలుస్తుంటార‌ని, అలా పోల్చ‌డం త‌న‌క‌స‌లు న‌చ్చ‌ద‌ని ఈ సంద‌ర్భంగా షాలినీ చెప్పుకొచ్చింది. ఆలియా భ‌ట్ ఎంతో మంచి పెర్ఫార్మ‌ర్ అని, ఇండ‌స్ట్రీకి మ‌రో ఆలియా అవ‌స‌రం లేద‌ని తెలిపింది. త‌న‌ను న‌టిగా గుర్తిస్తే చాలని, ఎవ‌రితో పోల్చాల్సిన ప‌న్లేద‌ని షాలినీ పాండే తెలిపింది.

Tags:    

Similar News