• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  45 కోట్ల రేంజుకు స్టార్...

45 కోట్ల రేంజుకు స్టార్ హీరో పారితోషికం!

| ఇటీవ‌ల ఫర్జీ 2 స్క్రిప్టింగ్ దశలో ఉంద‌ని రాశీ ఖ‌న్నా ధృవీకరించింది. తాజా స‌మాచారం మేర‌కు ఫ‌ర్జీ 2 కోసం షాహిద్ త‌న కెరీర్ బెస్ట్ పారితోషికం అందుకోబోతున్నాడ‌ని తెలిసింది.

By - Tupaki Desk
Update: 2025-05-11 04:27 GMT

తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డికె నిర్మించిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ `ఫర్జీ`తో షాహిద్ కపూర్ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ సిరీస్‌లో విజయ్ సేతుపతి, కే కే మీనన్, రాశి ఖన్నా, భువన్ అరోరా త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. స‌రైన అవ‌కాశాల్లేక‌ నిరాశ చెందిన కళాకారుడి క‌థ‌తో ఈ సిరీస్ తెర‌కెక్కింది. ఫేక్ క‌రెన్సీ త‌యారు చేసే క్రిమిన‌ల్ గా ఈ న‌టుడు మారాక ఏం జ‌రిగింద‌నేది ఓటీటీ తెర‌పై చూడాలి.

ఇటీవ‌ల ఫర్జీ 2 స్క్రిప్టింగ్ దశలో ఉంద‌ని రాశీ ఖ‌న్నా ధృవీకరించింది. తాజా స‌మాచారం మేర‌కు ఫ‌ర్జీ 2 కోసం షాహిద్ త‌న కెరీర్ బెస్ట్ పారితోషికం అందుకోబోతున్నాడ‌ని తెలిసింది. రెండో సీజ‌న్ కోసం అత‌డు త‌న పారితోషికాన్ని భారీగా పెంచాడు. షాహిద్ స్వ‌త‌హాగా 30కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తాడు. కానీ ఫ‌ర్జీ సీజ‌న్ 2 కోసం దాదాపు రూ. 45 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ఖాన్ లు 100కోట్లు అందుకుంటున్నారు. ఆ త‌ర్వాత‌ అత్యధిక పారితోషికం తీసుకునే బాలీవుడ్ నటులలో ఒకడిగా షాహిద్ స్థిర‌ప‌డుతున్నాడు. అత‌డు సాధారణంగా ఒక చిత్రానికి రూ. 25-30 కోట్లు వసూలు చేస్తాడు. కానీ ఇప్పుడు 15 కోట్లు అద‌నంగా ఫీజును పెంచాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. షాహిద్ కపూర్ చివరిగా దేవాలో కనిపించాడు. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో చ‌క్క‌ని ఆద‌ర‌ణ పొందింది. ఇందులో షాహిద్ మాస్ పోలీస్ గా న‌టించాడు. ఒక‌ కేసులో చిక్కుకున్న ధైర్యవంతుడైన పోలీసు అధికారి గా న‌టించాడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రను పోషించింది. విశాల్ భరద్వాజ్ త‌దుప‌రి యాక్షన్ థ్రిల్లర్‌లోను షాహిద్ న‌టించ‌నున్నాడు.

Tags:    
  • Farzi2 
  • ShahidKapoor 
  • VijaySethupathi 
  • OTTIndia 
  • ShahidOnOTT 
  • FarziSeason2 
  • IndianWebSeries 

Similar News

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS