లీకైన వీడియోతో మళ్ళీ పఠాన్ వైబ్స్!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ - దీపికా పదుకొణే కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగుతుంది.;
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ - దీపికా పదుకొణే కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగుతుంది. `ఓం శాంతి ఓం` నుండి `పఠాన్` వరకు వెండితెరపై మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. తాజాగా హిట్ జోడీ కింగ్ కోసం జతకట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో సినిమా సెట్స్ నుండి ఒక రొమాంటిక్ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన వీడియో లీక్ కావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. లీకైన వీడియోలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే అందమైన లొకేషన్‌లో రొమాంటిక్ స్టెప్పులు వేస్తూ కనిపించారు.
విజువల్స్ చూస్తుంటే అభిమానులకు ఫేవరెట్ జోడీ గత చిత్రం పఠాన్లోని వైబ్స్ గుర్తుకొస్తున్నాయి. వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఆ గ్రేస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సాధారణంగా భారీ చిత్రాల షూటింగ్ సమయంలో ఇలాంటి వీడియోలు లీక్ అవ్వడం చిత్ర యూనిట్‌ను కలవరపెడుతుంటుంది. అయితే, అభిమానులకు మాత్రం ఇది ఓ తీపి కబురులా మారింది. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను షేర్ చేస్తూ `బాద్‌షా మళ్ళీ తన క్వీన్‌తో తిరిగి వచ్చాడు` అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి కలయికలో పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలిచిన సందర్భాలెన్నో.
ఈ నేపథ్యంలో కింగ్ సాంగ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే భేషరామ్ సాంగ్ తరహాలో వివాదం అవుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు పెళ్లైన వారు. పిల్లల కలవారు. అలాంటి జోడీ మరీ రొమాంటిక్ గా నటించడం ఏంటనే? విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ పాటను జనాలు ఎంత సీరియస్ గా తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ -ఎమోషన్స్ కలగలిసిన విభిన్నమైన కథాంశంతో షారుఖ్ ప్రేక్షకులను పలకరించనున్నారు.
ప్రస్తుతం దీపికా పదుకొనే తల్లిగా తన బాధ్యతలను నెరవర్తీస్తూనే ఇలాంటి స్పెషల్ ప్రాజెక్టులకు సమయం కేటాయించడం విశేషం. షారుఖ్-దీపికా జోడీలో ఉన్న ఆ ప్రత్యేకమైన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద మరోసారి రిపీట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.లీకైన ఈ వీడియో సినిమా ప్రమోషన్లకు ఓ రకంగా ప్లస్ పాయింట్ అవుతుంది. షారుఖ్, దీపికాల రొమాంటిక్ కెమిస్ట్రీని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. `పఠాన్` వైబ్స్‌ను గుర్తుకు తెస్తున్న ఈ అప్‌డేట్ సినిమాపై ఉన్న హైప్‌ను రెట్టింపు చేస్తోంది. `కింగ్ `ఈసారి ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.