'కింగ్' వెన‌క 'సైయ్యారా' హీరో తండ్రి?

అత‌డు ఇండ‌స్ట్రీకి ఒక అనామ‌కుడిగా వ‌చ్చాడు. హీరో అవ్వాల‌ని క‌ల‌లు కంటూ ముంబైలో అడుగుపెట్టాడు. ఆ త‌ర్వాత విల‌న్ పాత్ర‌తో మొద‌లు పెట్టాడు. నెమ్మ‌దిగా హీరో అయ్యాడు.;

Update: 2025-07-21 04:24 GMT

అత‌డు ఇండ‌స్ట్రీకి ఒక అనామ‌కుడిగా వ‌చ్చాడు. హీరో అవ్వాల‌ని క‌ల‌లు కంటూ ముంబైలో అడుగుపెట్టాడు. ఆ త‌ర్వాత విల‌న్ పాత్ర‌తో మొద‌లు పెట్టాడు. నెమ్మ‌దిగా హీరో అయ్యాడు. అటుపై ఒక్కో మెట్టు ఎక్కుతూ సూప‌ర్ స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకున్నాడు. నేడు భార‌త‌దేశంలోనే హీరోలంద‌రిలో 'కింగ్' అని పిలుపందుకున్నాడు. ఇదంతా ఎవ‌రి గురించో కాదు.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ గురించి.

అయితే అంత పెద్ద స్టార్ కి 'సైయారా' ఫేం అహాన్ పాండే తండ్రి చిక్కి పాండే క‌ష్ట‌కాలంలో ఆశ్ర‌యం ఇచ్చారంటే న‌మ్మ‌గ‌ల‌రా? హిందూస్తాన్ టైమ్స్ క‌థ‌నం ప్రకారం చిక్కి పాండే బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్ కి బెస్ట్ ఫ్రెండ్. వారి బంధం ముంబైలో షారుఖ్ న‌టుడిగా ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన రోజుల నుంచి ఉంది. షారుఖ్ సినిమా పరిశ్రమలో స్థిరపడటానికి ఇబ్బంది పడుతున్న సమయంలో చుంకీ పాండే(అన‌న్య పాండే తండ్రి)తో పాటు అత‌డి సోద‌రుడు చిక్కీ పాండే షారూఖ్‌కి ఉండ‌టానికి నిలువ నీడ‌ను ఇచ్చారు. ఆశ్రయం ఇవ్వ‌డంతో పాటు న‌టుడిగా ఎదిగేందుకు మద్దతు ఇచ్చాడు చిక్కి . బాలీవుడ్ లో షారూఖ్ 'కింగ్' కావడానికి చాలా కాలం ముందే పాండే సోదరులు అత‌డిని దర్శకులు, నిర్మాతలకు పరిచయం చేశారు.

అలాగే 2008లో కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకల్లో షారుఖ్ ఖాన్ వ‌ర్సెస్ సల్మాన్ ఖాన్ గొడ‌వ‌లతో విడిపోయాక‌,.. ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రినీ క‌లిపే విష‌యంలో చిక్కీ పాండే కీలక పాత్ర పోషించారని పరిశ్రమ వర్గాలు చెబుతాయి. 2013లో బాబా సిద్ధిక్ ఇఫ్తార్ పార్టీలో ఆ ఇద్ద‌రినీ క‌ల‌ప‌డంలో కీల‌క పాత్ర‌ధారి చిక్కి. బాబా సిద్ధిక్ ఇద్దరు ఖాన్‌లతో లాంగ్ టైమ్ ఫ్రెండ్‌ గా మార‌డానికి ఆ ఘ‌ట‌న కార‌ణం. నిజానికి షారుఖ్ కు చిక్కి ఎంత క్లోజ్ అంటే? అతడి కారులో షారుఖ్ నివాసం అయిన మన్నత్ కు రాత్రి, పగలు ఏ సమయంలోనైనా ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రవేశం ఉంటుంది. రెండు కుటుంబాల మధ్య అంత గొప్ప స్నేహం ఉంది. అహాన్ తండ్రి వ్యాపారం - రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తుండగా, ఈ యువ‌హీరో తల్లి డీన్ పాండే ఆరోగ్యం - ఫిట్‌నెస్ ప్రపంచంలో ప‌వ‌ర్ క్వీన్ గా ఎదిగారు.

Tags:    

Similar News