ఆ సీనియర్లకు అనుష్క నో చెబుతోందా?
సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్యలకు హీరోయిన్లను ఎంపిక చేయడంలో జరుగుతోన్నజాప్యం గురించి చెప్పాల్సిన పనిలేదు.;
సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్యలకు హీరోయిన్లను ఎంపిక చేయడంలో జరుగుతోన్నజాప్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. అంతా 60 దాటిన హీరోలు కావడంతో? ఆ వయసుకు తగ్గ భామల్ని వెతికి పట్టుకోవడం దర్శకులకు తలకు మించిన భారంగా మారుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయినా? హీరోయిన్ ఎంపిక కారణంగా చివర్లో పెండింగ్ లా మారుతోంది ప్రాజెక్ట్. హీరోల వయసు ముదిరే కొద్ది సమస్య మరింత జఠిలమవుతుంది. దీంతో రిపీటెడ్ భామల్నే మళ్లీ రిపీట్ చేయాల్సి వస్తోంది.
ఆ ఇద్దరు తర్వాత ఆమె:
త్రిష, నయనతార తప్ప మరో భామ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బాలయ్య కొత్త సినిమా కోసం గోపీచంద్ మలినేని నయనతారను ఎంపిక చేయడం కంటే ముందుగానే స్వీటీ అనుష్కను అప్రోచ్ అయ్యారట. విషయం చెప్పగానే అనుష్క మాత్రం ఆఫర్ ని తిరస్కరించిందట. అందుకు బాలయ్య అని కాదు. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో ఏ సినిమా చేయలేనని చెప్పిందట. మరి అనుష్క అలా ఎందుకు చెప్పింది అన్నది తేలాల్సిన అంశం.
సీనియర్లకు పర్పెక్ట్ నటి:
'ఘాటీ' సినిమా దగ్గర నుంచి అనుష్క బయట కనిపించని సంగతి తెలిసిందే. బాగా బరువు పెరిగిపోవడంతో దాన్ని తగ్గించుకునే క్రమంలో బయటకు రాలేదు? అనే మాట తొలి నుంచి వినిపిస్తోంది. మరి ఆ కారణంగా సీనియర్లకు తాను సెట్ అవ్వదు అన్న కోణంలో నో చెప్పిందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. కానీ స్వీటీ ఒకే చెబితే గనుక సీనియర్లు అందరికీ అమ్మడు మంచి ఆప్షన్ అవుతుంది. ఇంత వరకూ చిరంజీవి, బాలయ్య కు జోడీగా స్వీటీ పని చేయలేదు. ఆమె పేరు కూడా ఏ దర్శకుడు పరిశీలనలోకి తీసుకోలేదు.
ఆ ముగ్గురే బ్యాలెన్స్:
ఇంత కాలానికి ఓ దర్శకుడు ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్లతో మాత్రం అమ్మడు కెరీర్ ఆరంభంలోనే పని చేసింది. ఆ తరం హీరోల్లో స్వీటీతో పని చేయనిది చిరు, బాలయ్య మాత్రమే. అనుష్క వాళ్లతో పాటు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తే టాలీవుడ్ లో దాదాపు హీరోలందరితో పనిచేసినట్లే అవుతుంది. కానీ ఇది జరుగుతుందా? లేదా? అన్న సందేహాలైతే ఉన్నాయి. ఇప్పటికే స్వీటీ ఫాం కోల్పోయింది. అవకాశాలు తగ్గాయి. ఇంకా ఆలస్యం చేస్తే వచ్చే అవకాశాలు కూడా రావు అన్నది కాదనలేని వాస్తవం. ప్రస్తుతం అనుష్క బెంగుళూరులో ఉంటోన్న సంగతి తెలిసిందే. అమ్మడు హైదరాబాద్ ని వదిలేసి చాలా కాలమవుతోంది. ఆ మద్య ఘాటీ షూటింగ్ లో భాగంగా కొన్నాళ్లు మళ్లీ హైదరాబాద్ లో స్టే చేసింది. కానీ షూట్ అనంతరం తిరిగి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మళ్లీ హైదరాబాద్ కి వచ్చింది లేదు.