కుబేర పై క‌మ్ములా కుమార్తె కామెంట్!

శేఖ‌ర్ క‌మ్ములా తెర‌కెక్కించిన `కుబేర` సినిమా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు మంచి రివ్యూలు వ‌చ్చాయి.;

Update: 2025-06-20 11:40 GMT

శేఖ‌ర్ క‌మ్ములా తెర‌కెక్కించిన `కుబేర` సినిమా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు మంచి రివ్యూలు వ‌చ్చాయి. ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని మెప్పించిన చిత్రంగా హైలైట్ అవుతుంది. క‌మ్ములా నుంచి ఓ డిఫ‌రెం ట్ జాన‌ర్ చిత్ర‌మోచ్చింద‌ని అంతా అంటున్నారు. అస‌లే కొత్త సినిమాలేవి లేక అల్లాడిపోతున్న అభిమానుల‌కు `కుబేర` రూపంలో మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ దొరికిన‌ట్లు అయింది. దీంతో సినీ ప్రియులంద‌రికీ పండ‌గే.

ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే శేఖ‌ర్ క‌మ్ములా త‌న కుటంబ విష‌యాలేవి పెద్ద‌గా బ‌య‌ట‌కు రావు. ఆయ‌న భార్య‌, పిల్ల‌ల సంగ‌తి కూడా తెలియ‌దు. వారు పెద్దగా ఎలాంటి సినిమా ఈవెంట్ల‌కు హాజ‌రు కారు. అయితే తాజాగా ప్ర‌సాద్ ఐమ్యాక్స్ లో `కుబేర` చిత్రాన్ని శేఖ‌ర్ క‌మ్ములా కుమార్తె వంద‌న వీక్షించారు. సినిమా చూసొచ్చిన అనంత‌రం త‌న రివ్యూ కూడా ఇచ్చారు. టీమ్ ని చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంది. మేం చాలా చాలా చెప్పాం.

దానికి మించి సినిమా ఉంది` అని అన్నారు. వందన ఇటీవ‌ల జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా క‌నిపించారు. 25 ఏళ్ల‌గా క‌మ్ములా సినిమాలు చూస్తున్నా ఏనాడు వందన బ‌య‌ట‌కు రాలేదు. ఈ మ‌ధ్య కాలంలో మీడియాలో వైర‌ల్ అవుతున్నారు. వంద‌న కూడా అచ్చంగా తండ్రి పోలిక‌ల‌తోనే ఉన్నారు. మ‌రి క‌మ్ములా వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని వందన డైరెక్ట‌ర్ అయితే బాగుంటుంది.

శేఖ‌ర్ క‌మ్ములా తీసిన సినిమాల‌కు త‌న ఇంట్లోనూ విమ‌ర్శ‌కులున్నాన‌ర‌ని..వారే త‌న చిత్రాన్ని జ‌డ్జ్ చేస్తార‌ని ఓ సంద‌ర్భంలో అన్నారు. కుమార్తె..భార్యల నుంచి త‌న సినిమాకు సంబంధించి తొలి రివ్యూ వ‌స్తుం ద‌ని..ఆ త‌ర్వాత రిజ‌ల్ట్ ఎలా ఉంటుంద‌న్న‌ది తాను డిసైడ్ అయిపోతాన‌న్నారు.

Tags:    

Similar News