ఫెయిల్డ్ రిలేషన్‌షిప్స్‌లోని ఒంట‌రి వ్య‌క్తుల‌తో పాపుల‌ర్ న‌టి ఆట‌లు!

డేటింగ్ రియాలిటీ.. సెకండ్ లవ్.. అంటూ ఒక ప్రముఖ తెలుగు సీనియర్ నటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై హల్‌చల్ చేయడానికి సిద్ధమయ్యారు.

Update: 2026-06-21 05:00 GMT

డేటింగ్ రియాలిటీ.. సెకండ్ లవ్.. అంటూ ఒక ప్రముఖ తెలుగు సీనియర్ నటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై హల్‌చల్ చేయడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఎన్నో గొప్ప బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి..తన అద్భుతమైన నటనతో మెప్పించిన ఈ వెటరన్ నటి ఇప్పుడు సరికొత్తగా ఒక రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించ‌డం చ‌ర్చ‌గా మారింది. ఈ సరికొత్త షో ప్రోమోల‌తో యువతను విశేషంగా ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీలో తెగ గుసగుసలకు కారణమవుతోంది.

ఈ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్న నటికి గతంలో `బిగ్ బాస్` షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్లకు హోస్ట్‌గా వ్యవహరించిన అనుభవం ఉండటం విశేషం. ఆ అనుభవంతోనే ఇప్పుడు పూర్తి స్థాయి రియాలిటీ సిరీస్‌ను నడిపించేందుకు రంగంలోకి దిగారు. గతంలో బుల్లితెర హోస్ట్‌గా చిన్న‌పాటి అనుభ‌వం ఉన్నా ఈ సీనియర్ నటి ఇప్పుడు హాటెస్ట్ ఓటీటీ షోతో రాబోతుండటంతో ప్రేక్షకులు, అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అన్నట్టు.. ఈ షో `డేటింగ్` అంటూ యూత్ ని ఊరిస్తూ.. రెండో పెళ్లి, సెకండ్ లవ్ కాన్సెప్టుతో సాగనుంది. జీవితంలో డిస్టర్బ్ అయి, విడిపోయిన జంటల గురించి టచ్ చేస్తూ ఈ షో ద్వారా సరికొత్త విషయాలను చూపించబోతున్నారు. పూర్తిగా వెస్ట్రన్ స్టైల్‌లో సాగే ఈ షో ప్రేక్షకుల్లో దడ పుట్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. నేటితరం ప్రేక్షకులకు కిక్కు పెంచేందుకు... సరికొత్త వినోదాన్ని అందించేందుకు ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నానికి ఈ వెట‌ర‌న్ న‌టి స‌హ‌క‌రించ‌డం కొంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఈ వినూత్నమైన తమిళ రియాలిటీ సిరీస్‌ను ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుండగా, పాపుల‌ర్ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తోంది. ఈ షోకు `సెకండ్ లవ్` అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ లు విడుద‌ల కాగా... మ‌రీ ఇలాంటి హా*టెస్ట్ షోకి ఈ వెట‌ర‌న్ న‌టిని ఎంపిక చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంద‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు లేదా పెళ్లి బంధాల్లో ఫెయిల్యూర్స్ ఎదుర్కొని, జీవితంలో రెండోసారి ప్రేమకు అవకాశం ఇవ్వాలనుకునే కాన్సెప్ట్‌తోనే ఈ షోని ప్లాన్ చేయ‌డం నిజంగా సౌత్ బుల్లితెర‌పై కొత్త ఫార్మాట్.

ఈ షో ఫార్మాట్ ప్రకారం.. జీవితంలో ప్రేమ వైఫల్యాలను, బ్రేకప్స్ లేదా హార్ట్‌బ్రేక్‌లను ఎదుర్కొన్న 12 మంది సింగిల్ పార్టిసిపెంట్స్ ఒకే వేదిక‌కు వ‌చ్చి వారి బాధ‌ల్ని వెల్ల‌గ‌క్క‌నున్నారు. ఉద్వేగాన్ని పెంచే.. ర‌క‌రకాల సంభాషణలు, టాస్క్‌లలో స్వీయానుభవాల ద్వారా వారు తమ ఎమోష‌న‌ల్ ఛాలెంజెస్ ని అధిగమించి మళ్లీ కొత్తగా ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఈ షోలో తేలనుంది. పాపుల‌ర్ తెలుగు సీనియర్ నటి ఈ ప్రయాణంలో కంటెస్టెంట్లకు హోస్ట్‌గా.. ఒక గైడ్‌గా వ్యవహరిస్తూ వారిని ముందుకు నడిపించడం ఒక‌ర‌కంగా ఛాలెంజ్ తో కూడుకున్న‌ది. త్వ‌ర‌లోనే ఒక అగ్ర న‌టుడి క్రేజీ సీక్వెల్ సినిమాలో న‌టిస్తున్న ఈ తెలుగు సీనియ‌ర్ న‌టి పూర్తి స్థాయిలో హోస్టింగ్ చేస్తున్న ఈ షోపై ఇటు తెలుగు నాటా చ‌ర్చ సాగుతోంది.

Tags:    

Similar News