'జెట్లీ' సత్య డ్యాన్స్ చూశారా?.. మళ్ళీ అదరగొట్టేశాడుగా!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ సత్య లీడ్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం జెట్లీపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.;

Update: 2026-04-02 12:43 GMT

టాలీవుడ్ స్టార్ కమెడియన్ సత్య లీడ్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం జెట్లీపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. మత్తు వదలరాతో తన ప్రత్యేక శైలిని చూపించిన దర్శకుడు రితేష్ రాణా, మరోసారి అదే టీమ్ తో కలిసి కామెడీ ఎంటర్టైనర్‌ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌ కు మంచి రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్.



 


చిత్రంలోని తొలి పాట సత్య ఈజ్ నాట్ జెట్లీను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చిన ఆ సాంగ్.. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఆ పాటకు సంగీతాన్ని కాల భైరవ అందించగా, ఆయన గాత్రంలోనే సాంగ్ వినిపిస్తుంది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ కు తగిన ఫన్నీ, సెటైరికల్ టోన్‌ తో పాటను కంపోజ్ చేశారు.

టెక్నో స్టైల్‌ లో రూపొందించిన ఆ సాంగ్, సినిమాలోని కథా నేపథ్యానికి బాగా సరిపోతుందని తెలుస్తోంది. పాటలో ముఖ్యంగా ఆకట్టుకునేది సత్య డాన్స్. ఇప్పటివరకు కామెడీ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సత్య, పాటలో మాత్రం తన డాన్స్ స్కిల్స్‌ తో కొత్తగా కనిపించారు. ఫ్లోర్ స్టెప్స్, స్టైలిష్ హుక్ స్టెప్స్, ఫ్రీ ఫ్లో కొరియోగ్రఫీ.. అన్నీ కలిపి ఆయన పెర్ఫార్మెన్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇప్పటికే మత్తు వదలరా 2లో తన డాన్స్‌తో ఆకట్టుకున్న సత్య.. ఈ సాంగ్‌ లో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చినట్లు కనిపిస్తోంది. పాటకు సాహిత్యం సాయి సోమయాజులు అందించారు. సత్య జెట్లీనా? కాదా? అనే కాన్సెప్ట్‌ తో సరదాగా సాగిన లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. శ్రావణ భార్గవి తన గాత్రంతో పాటకు మరో అందాన్ని జోడించారు. ఆమె గానం కామెడీ ఫీల్‌ ను బాగా ఎలివేట్ చేస్తోంది.

చిత్రంలో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఆమెకు ఇది తెలుగులో తొలి చిత్రం కావడం విశేషం. పాటలో ఆమె గ్లామర్‌ తో పాటు డాన్స్ మూవ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై చెర్రీ, హేమలత పెద్దమల్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినిమాటోగ్రఫీని సురేష్ సారంగం నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలు కార్తీక శ్రీనివాస్ తీసుకున్నారు. ప్రొడక్షన్ డిజైన్ నార్ని శ్రీనివాస్ చేస్తున్నారు. మత్తు వదలరా సినిమాకు పనిచేసిన మెయిన్ టెక్నికల్ టీమ్ జెట్లీకి కూడా పని చేయడం ఆ ప్రాజెక్ట్‌ పై మరింత ఆసక్తిని పెంచుతోంది. రితేష్ రాణా తన ప్రత్యేకమైన హాస్య శైలితో ఈసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి సత్య ఈజ్ నాట్ జెట్లీ పాట విడుదలతో జెట్లీ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News