అందుకే రజనీకాంత్ మూవీని తిరస్కరించా.. 18 ఏళ్ల తర్వాత మౌనం వీడిన కట్టప్ప!
అలాంటి ఈయన తాజాగా రజనీకాంత్ మూవీని గతంలో తిరస్కరించడంపై 18 ఏళ్ల తర్వాత స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం;
బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు ప్రముఖ కోలీవుడ్ నటుడు సత్యరాజ్. తమిళ్, తెలుగు చిత్రాలలో నటిస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ఒక మంచి గుర్తింపు అందుకున్నారు. అలాంటి ఈయన తాజాగా రజనీకాంత్ మూవీని గతంలో తిరస్కరించడంపై 18 ఏళ్ల తర్వాత స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం
రజినీకాంత్ మూవీని రిజెక్ట్ చేసిన సత్యరాజ్..
విషయంలోకి వెళ్తే.. 2007లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం శివాజీ. ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో విలన్ పాత్ర కోసం మొదట సత్యరాజ్ ను డైరెక్టర్ శంకర్ సంప్రదించగా ఆయన తిరస్కరించాడట. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చకు దారితీసింది. రజినీకాంత్ సినిమాలలో సత్యరాజ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు వార్తలు క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఎంత కష్టపడినా రజినీకాంత్ తన స్టైల్ తో అందరినీ ఆకర్షిస్తారని, తనకు గుర్తింపు లభించదని, అందుకే సత్యరాజ్ ఆ పాత్రను రిజెక్ట్ చేశారంటూ ఇలా ఎవరికి వారు కామెంట్లు చేశారు. ఆ తర్వాత చిత్ర బృందం ఆ పాత్ర కోసం హీరో సుమన్ ను సంప్రదించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ సినిమాతో మంచి ఇమేజ్ అందుకున్నారు.
18 ఏళ్ల తర్వాత మౌనం వీడిన సత్యరాజ్..
అలా ఎప్పుడో 18 ఏళ్ల క్రితం జరిగిపోయిన ఈ విషయంపై తాజాగా సత్యరాజ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 1986లో వచ్చిన 'మిస్టర్ భరత్' అనే సినిమాలో రజనీకాంత్ కి నేను తండ్రి పాత్రలో నటించాను. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన నాకు హీరోగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అప్పుడే శివాజీ మూవీ నుండి ఆఫర్ వచ్చింది. అయితే శివాజీ సినిమాను అంగీకరించక పోవడానికి ఒక బలమైన కారణం ఉంది. హీరోగా అవకాశాలు అందుకుంటున్న సమయంలో విలన్ గా చేస్తే.. మునుముందు అన్ని అలాంటి పాత్రలే వస్తాయనే కారణంతో ప్రతి నాయకుడి పాత్ర కోసం శంకర్ అడిగినప్పుడు రిజెక్ట్ చేశాను.. కానీ మీడియాలో ఏవేవో వార్తలు వచ్చాయి. అవన్నీ ఏమాత్రం నిజం కాదు " అంటూ 18 ఏళ్లుగా సాగుతున్న కాంట్రవర్సీకి పులిస్టాప్ పెట్టారు. అయితే ఇది చూసిన నెటిజన్స్ మాత్రం అప్పుడే సమాధానం ఇచ్చి ఉంటే సరిపోయేది కదా.. సమాధానం ఇవ్వడానికి ఇన్నేళ్ల సమయం పట్టిందా అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు.
38 ఏళ్ల తర్వాత రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సత్యరాజ్
ఇకపోతే అలా శివాజీ సినిమాలో అవకాశాన్ని వదులుకున్న సత్యరాజ్.. మళ్లీ 38 ఏళ్ల తర్వాత లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇందులో రజనీకాంత్ హీరోగా నటించారు. ఈ సినిమాలో రజనీకాంత్ స్నేహితుడు రాజశేఖర్ పాత్రలో సత్యరాజ్ నటించి ఆకట్టుకున్నారు.