విలువైనవి ఎన్నో నేర్పారు: సారా టెండూల్కర్
తండ్రి కూతురు అనుబంధం ఎంతో గొప్పది. ముఖ్యంగా ఎమోషనల్ గా ఎక్కువగా కనెక్టయి ఉండే బంధం ఇది.;
తండ్రి కూతురు అనుబంధం ఎంతో గొప్పది. ముఖ్యంగా ఎమోషనల్ గా ఎక్కువగా కనెక్టయి ఉండే బంధం ఇది. అదే తరహాలో ఇక్కడ తండ్రి కూతురు నడుమ అనుబంధం మనసుల్ని గెలుచుకుంటోంది. పాపా సచిన్ టెండూల్కర్ 52వ పుట్టినరోజు సందర్భంగా తండ్రితో తన అనుబంధం ఎలాంటిదో గుర్తు చేసుకుంది సారా టెండూల్కర్. డాడ్ సచిన్‌తో తన స్నేహం, మధురమైన జ్ఞాపకాలను సారా గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.
ఒక చిన్నారిగా నాన్న భుజాల పైకి ఎక్కిన రోజులు.. ఎదిగే క్రమంలో హుషారు.. టీనేజీ ప్రాయం దాటుకుని పరిణతి చెందిన యువతిగా మారిన సారా.. అన్ని వేళలా తన తండ్రితో ఉన్న అనుబంధం ఎలాంటిదో కొన్ని ఫోటోల ద్వారా బయటపెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు నాన్నగారి త్యాగాల్ని కూడా సారా గుర్తు చేసుకుంటోంది.
జీవితంలో తన తండ్రి పాత్ర గురించి సారా వెల్లడించింది. ఎవరికీ భయపడవద్దని.. అందరినీ గౌరవించాలని నాకు బోధించిన వ్యక్తికి.. నా విరిగిన చేయి (అంతులేని ఇతర గాయాల జాబితా) తో ఉన్నపుడు నన్ను మోసిన వ్యక్తికి .., ముఖ్యంగా సరదాగా గడుపుతూ.. నవ్వుతూ జీవితాన్ని ఆస్వాధించడం చాలా ముఖ్యమని నేర్పిన వ్యక్తి.. అంటూ తన తండ్రి సచిన్ తన జీవితానికి విలువైనవి ఎన్నో నేర్పించారని సారా తెలిపింది. ఇలాంటి గొప్ప స్నేహితుడి లాంటి తండ్రిని తాను కలిగి ఉండటం ఎన్నో జన్మల పుణ్యఫలం! అని సారా టెండూల్కర్ భావిస్తోంది. సారా ప్రస్తుతం మోడల్ గా రాణిస్తోంది. బాలీవుడ్ లో నటిగా ప్రవేశిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. లేదా పోషకాహార నిపుణురాలిగా వైద్యురాలిగా కొనసాగుతుందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్ న్యూట్రిషన్ స్టడీస్ లో సారా డిగ్రీ పట్టాను సంపాదించిన సంగతి తెలిసిందే.