ఫోటో స్టోరి: జెన్ Z ఫ్యాషనిస్టా సారా టెండూల్కర్
తనదైన అందం, యాటిట్యూడ్, ఫ్యాషన్ సెన్స్‌తో హృదయాలను గెలుచుకోవడంలో క్రికెట్ లెజెండ్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఎప్పుడూ విఫలం కాదు.;
తనదైన అందం, యాటిట్యూడ్, ఫ్యాషన్ సెన్స్‌తో హృదయాలను గెలుచుకోవడంలో క్రికెట్ లెజెండ్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఎప్పుడూ విఫలం కాదు. ఈ ఫ్యాషనిస్టా టాప్ మోడల్ గా రాణిస్తోంది. మరోవైపు సారా టెండూల్కర్ బాలీవుడ్ లో అడుగుపెట్టాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నా, ఆ శుభవార్తను ఇంకా చెప్పలేదు టెండూల్కర్ కుటుంబం. నేటితరం స్టార్ కిడ్స్ కి ఎంతమాత్రం తగ్గని ఛరిష్మా సారా సొంతం. తన అందం, హావభావాలు ఒక స్టార్ హీరోయిన్ కి తక్కువేమీ కాదని నమ్ముతున్నారు. అయినా సారా నుంచి సానుకూలత కనిపించలేదు.
సారా టెండూల్కర్ ఇటీవలే తన తండ్రి ముఖ్య అతిథిగా వెల్ నెస్- ఫిట్నెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సారా తన మొదటి ఫిట్నెస్ స్టూడియోని ఇప్పటికే ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఫిట్నెస్ వెల్ నెస్ సెంటర్లను ప్రారంభించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నారు.
అలాగే సారా టాప్ మోడల్ గా భారీ అవకాశాల్ని అందుకుంటున్నారు. ఆస్ట్రేలియా దేశ టూరిజం వృద్ధి కోసం బ్రాండ్ అంబాసిడర్ గా సారా టెండూల్కర్ పని చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా అందచందాలు, గొప్పతనం గురించి వర్ణిస్తూ సారా టెండూల్కర్ షేర్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్ లో తుఫాన్ స్పీడ్ తో దూసుకుపోయింది. ``నేను ఎప్పుడూ ఇష్టపడే ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్ ఆరంభ రోజుల్లో సందర్శించిన ప్రదేశాలలో ఒకటి. ఈ నగరం ఇప్పటికీ అద్భుత ఆకర్షణతో వెలిగిపోతోంది..ఇక్కడ లేన్‌వేలు, రూఫ్‌టాప్ బార్ ల నుండి గోల్డెన్ గంట గ్లో వరకూ ప్రతిదీ ఆకర్షిస్తాయి.. అంటూ మెల్ బోర్న్ సొగసు గురించి వర్ణించింది సారా. సారా పర్ఫెక్ట్ అంబాసిడర్ అంటూ అభిమానులు కితాబిచ్చారు.
తాజాగా ప్రఖ్యాత `ఎల్లే డిజిటల్` కవర్ పేజీ కోసం సారా ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటోషూట్ లో సారా ట్రెడిషనల్ అవతార్ లో కనిపించినా నేటి జెన్ జెడ్ ఇష్టపడే ఫ్యాషన్ సెన్స్ తో ఆకర్షించింది. ఒక ప్రత్యేకమైన డిజైనర్ ఫ్రాక్ ధరించి, రాజస్థానీ ఆర్ట్ వర్క్ తో రూపొందించిన ప్రత్యేకమైన కోట్ లో దేవతా సుందరిని తలపించింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.