• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొండేటి గోవా ఈవెంట్.....

కొండేటి గోవా ఈవెంట్.. గొడవపై ఫిల్మ్ ఛాంబర్ అసలు క్లారిటీ

| ఈ లేఖలో ఏముందంటే.. డిసెంబర్ 3 గోవాలో జరిగిన 23వ సంతోషం అవార్డుల ఫంక్షన్ కు తెలుగు సినీ పరిశ్రమ పేరు చెప్పి అనుమతులు తీసుకున్నారు

By - Tupaki Desk
Update: 2023-12-05 04:30 GMT

ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి ఆధ్వర్యంలో గోవాలో జరిగిన సంతోషం ఫిలిం అవార్డ్స్ ఘటనపై నిన్న అల్లు అరవింద్ మీడియా వేదిక స్పందించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ట్విట్టర్ వేదికగా సురేష్ కొండేటి సైతం దీనిపై స్పందించారు. ఇక ఇప్పుడు ఇదే వివాదంపై జర్నలిస్ట్ ఫిలిం నగర్ కల్చరర్ సెంటర్, తెలుగు ఫిలిం అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సురేష్ ని ఉద్దేశించి జరిగిన తప్పులను స్పష్టంగా వివరిస్తూ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పేరుతో ఒక లేఖను విలేకరుల సంఘానికి పంపింది.


ఈ లేఖలో ఏముందంటే.. డిసెంబర్ 3 గోవాలో జరిగిన 23వ సంతోషం అవార్డుల ఫంక్షన్ కు తెలుగు సినీ పరిశ్రమ పేరు చెప్పి అనుమతులు తీసుకున్నారు. ఎన్నో కంపెనీలు, వ్యక్తులు ఇందులో స్పాన్సర్ చేసేందుకు భాగమయ్యారు. టాలీవుడ్ బ్రాండ్ మీదే ఇదంతా జరిగింది. అయితే స్థానికంగా ఉండే సంఘాలతో సమన్వయం చేసుకోకుండా వేడుకకు పని చేసిన వాళ్లకు డబ్బులు చెల్లించడంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల తీవ్ర పరిణామాలు తలెత్తాయి.

క్యాబ్ డ్రైవర్లకు కూడా అద్దెలు చెల్లించకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది. ఎంతోమంది సెలబ్రిటీలు అసౌకర్యానికి గురయ్యారు. కొంతమంది ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకులకు హోటల్ లో ప్రవేశించడానికి అనుమతి దొరకలేదు. అందుకు కారణం అక్కడ చెల్లించాల్సిన బాకీలు ఇంకా ఉండడమే. అల్లు అరవింద్ తో పాటు దామోదర్ ప్రసాద్ దీన్ని పరిష్కరించగలిగారు.

మూడో తేదీ రాత్రి ఒంటిగంటకు హోటల్ రూమ్స్ కు బయలుదేరిన ఆర్టిస్టులను డ్రైవర్లు అడ్డుకున్నారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మొదలవ్వాల్సిన ఈవెంట్.. ఏర్పాట్లలో అలసత్వం, ఆర్థిక వ్యవహారాల వల్ల రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది. గంట తర్వాత అల్లు అరవింద్ వేదిక మీద ఉండగానే సప్లయర్స్ పవర్ కట్ చేశారు.

తిరిగి పునరుద్ధరించే సమయానికి సురేష్ నాలుగో తేదీ తెల్లవారుజామునే ఫ్లైట్లో హైదరాబాద్ కి వెళ్ళిపోయారు. ఫోన్ తీయడం లేదు. దీనివల్ల గోవా ప్రభుత్వంలో చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోగలరు.. అంటూ ఆ లేఖలో రాసి ఉంది.

Tags:    
  • Sureshkondeti 
  • Santoshamawards 
  • Goaevent 
  • Filmchamber 
  • Alluaravind 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS