'సంతాన ప్రాప్తిరస్తు' కొత్త అప్డేట్.. క్రేజీ సాంగ్ ను విన్నారా?
వెన్నెల కిషోర్.. సంతాన ప్రాప్తిరస్తు చిత్రంలో డాక్టర్ భ్రమరాం పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీలో అతడు ఇచ్చిన సలహాలు కథానాయకుడు ఇబ్బందులను పెంచుతుంది.;
టాలీవుడ్ యువ నటుడు విక్రాంత్, తెలుగమ్మాయి చాందిని చౌదరీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా సంతాన ప్రాప్తిరస్తు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. కామెడీతో పాటు ప్రస్తుత జనరేషన్ యూత్ కు మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలా ఉండిబోతుందని తెలుస్తోంది.
మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించగా.. వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, జీవన్ కుమార్, రమేష్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. షేక్ దావూద్ జీ స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వర్తించారు.
అదే సమయంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ను ఇప్పటికే స్టార్ట్ చేశారు. మొదటి సింగిల్ నాలో ఏదో అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి రెస్పాన్స్ అందుకుంది. అదే ఉత్సాహంతో అనుకుందోకటి లే అయ్యిందోకటి లే సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు. విచిత్రమైన, సందర్భోచిత ట్రాక్ ను విడుదల చేశారు.
ఆ సాంగ్ తో హాస్య నటుడు వెన్నెల కిషోర్.. గాయకుడిగా మారారు. తొలిసారి మైక్ ను అందుకున్నారు. కథానాయకుడి జీవితంలోని గందరగోళాన్ని ప్రతిబింబించే కామెడీ సాంగ్ కు తన స్వరాన్ని ఇచ్చారు. సునీల్ కశ్యప్ కంపోజ్ చేసిన ఆ పాట.. వింతైన, ఉల్లాసభరితమైన స్వరాన్ని కలిగి ఉందని చెప్పాలి.
వెన్నెల కిషోర్.. సంతాన ప్రాప్తిరస్తు చిత్రంలో డాక్టర్ భ్రమరాం పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీలో అతడు ఇచ్చిన సలహాలు కథానాయకుడు ఇబ్బందులను పెంచుతుంది. ఈ లిరికల్ వీడియో సాంగ్ లో వెన్నెల కిషోర్.. స్టూడియోలో తెరవెనుక ఫుటేజ్ ఉంది. అది మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
సాంగ్ కు బాలవర్ధన్ రాసిన సాహిత్యం ఆకర్షణీయంగా ఉంది. సాంగ్ సినిమాలో సందర్భానికి సరిపోతుందని చెప్పాలి. ఉత్సాహభరితమైన సంగీతం, తెలివైన రచనతో అనుకుందోకటి లే అయ్యిందోకటి లే సాంగ్ ఇప్పుడు అందరినీ మెప్పిస్తోంది. మ్యూజిక్ లవర్స్ కు ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇస్తోంది.
అయితే వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న ఓ యువకుడు తన భార్యను గర్భవతిని చేయడానికి కష్టపడుతున్న కథతో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సలహాలు, డైట్ ఫాలో అవుతూ వంద రోజుల్లో తన భార్యను ప్రెగ్నెంట్ చేయాలని ప్రయత్నాలు చేస్తారు హీరో. చివరకు ఏమైందనే మూవీ కథగా టీజర్ చూస్తే అనిపిస్తోంది.