సంక్రాంతి..థియేట‌ర్ల‌కు మ‌ళ్లీ పండ‌గొచ్చింది!

తెలుగు రాష్ట్రాల్లోని చాలా వ‌ర‌కు థియేట‌ర్లు బోసిపోయాయి. చాలా వ‌ర‌కు స్టార్ హీరోల సినిమాలు లేక‌, రిలీజ్‌లు లేక‌పోవ‌డంతో చాలా వ‌ర‌కు బోసిపోయాయి.;

Update: 2026-01-09 10:03 GMT

తెలుగు రాష్ట్రాల్లోని చాలా వ‌ర‌కు థియేట‌ర్లు బోసిపోయాయి. చాలా వ‌ర‌కు స్టార్ హీరోల సినిమాలు లేక‌, రిలీజ్‌లు లేక‌పోవ‌డంతో చాలా వ‌ర‌కు బోసిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే క‌ళ త‌ప్పాయి. మునుప‌టి సంద‌ళ్లు లేవు. థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల హంగామా లేదు. ప్రేక్ష‌కులు కూడా మునుప‌టి త‌ర‌హాలో థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఇష్ట‌ప‌డక‌పోవ‌డం, బిజినెస్ లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో చాలా వ‌ర‌కు థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. టాలీవుడ్ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచిన సింగిల్ స్క్రీన్‌లు ఒక్కొట్టిగా మూత‌ప‌డుతున్నాయి.

ఇక కొన్ని థియేట‌ర్ల‌ని మూయ‌లేక‌.. న‌డ‌ప‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఉన్న ఎంప్లాయిస్‌కి స‌రైన జీతాలు ఇవ్వ‌లేక వారిని భ‌రించ‌లేని స్థితికి చేరుకున్నాయి. సినిమాల‌ని బ‌ట్టి డైలీ వేజెస్ ఇస్తూ ర‌న్ చేస్తున్నాయి. బీ, సీ సెంట‌ర్ల‌లోని చాలా వ‌ర‌కు థియేట‌ర్ల ప‌రిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ఒక ద‌శ‌లో టాలీవుడ్‌కు ప‌ట్టుకొమ్మ‌లుగా నిలిచిన బీ,సీ సెంట‌ర్ల సింగిల్ స్క్రీన్‌లు ఇప్పుడు స‌రైన సినిమాలు లేక‌, బిజినెస్ అనుకున్న స్థాయిలో జ‌ర‌క్క‌పోవ‌డంతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి.

అయితే సంక్రాంతి పండ‌గ రావ‌డంతో ఇప్పుడు థియేట‌ర్ల‌లో పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎలాగైతే బ‌స్సుల‌కు హెవీ క్రౌడ్ మొద‌లైందో `ది రాజాసాబ్‌` థియేట‌ర్ల‌కు కూడా అదే త‌ర‌హాలో ఆంధ్రా, తెలంగాణ‌ల్లో ప్రేక్ష‌కుల తాకిడి భారీగా మొద‌లైంది. దీంతో థియేట‌ర్ల‌న్నీ య‌మ యాక్టీవ్‌గా మారిపోయాయి. అక్క‌డ వారావ‌ర‌ణం కూడా భారీగా మారిపోయి పండ‌గ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తూ థియేట‌ర్ ప‌రిస‌రాల‌న్నీ క‌ల‌ర్ ఫుల్‌గా మారి క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. కాంతుళీనుతున్నాయి.

సంక్రాంతి సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో ముందే దీన్ని గ్ర‌హించిన థియేట‌ర్ యాజ‌మాన్యం, సిబ్బంది.. థియేట‌ర్ల బూజు దులిపేసి స‌ర్వాంగ సుంద‌రంగా రెడీ చేసి సంక్రాంతి సంద‌డికి సిద్ధం చేశారు. ప్రొజెక్ట‌ర్ల‌ని కూడా స‌రికొత్త హంగుల‌తో తీర్చి దిద్ది ప్రొజెక్ట‌ర్ల‌కు కొత్త బ‌ల్బులు బిగించేశారు. అన్నీ ర‌కాల మార్పులు పూర్తి చేసి సంక్రాంతి సినిమాల సంద‌డికి ముస్తాబ్ అయ్యాయి. సంక్రాంతి ఏడాదికి ఒక‌సారి వ‌చ్చే కీల‌క సీజ‌న్‌. ఈ సీజ‌న్‌లో సినిమా రిలీజ్ చేయాల‌ని, హిట్టు కొట్టాల‌ని కోరుకోని హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాత ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు.

దీంతో సంక్రాంతి స‌మ‌రానికి భారీ క్రేజ్ ఏర్ప‌డుతూ ఉంటుంది. ఈ సంక్రాంతికి `ది రాజాసాబ్‌`తో అస‌లు హంగామామొద‌లైంది. దీన్ని మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` కంటిన్యూ చేస్తూ `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి`, నారీ నారీ న‌డుమ మురారీ, అన‌గ‌న‌గ ఒక రాజు` విజ‌య‌తీరాల‌కు చేరుస్తాయా? అన్న‌ది వేచి చూడాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌మోష‌న్స్‌ని బ‌ట్టి చూస్తుంటే సంక్రాంతి బ‌రిలో దిగుతున్న సినిమాలు దేనిక‌దే ప్ర‌త్యేక‌త‌తో థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. వీటిల్లో ఏది సంక్రాంతి విజేత‌గా నిలుస్తుంద‌న్న‌ది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News