సంక్రాంతి రేస్.. ప్రభాస్ ఉన్నట్టా? లేనట్టా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు హీరోలు, దర్శకులు, నిర్మాతలంతా తమ సినిమాలను అప్పుడే రిలీజ్ చేయాలనుకుంటారు.;

Update: 2025-08-23 08:03 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు హీరోలు, దర్శకులు, నిర్మాతలంతా తమ సినిమాలను అప్పుడే రిలీజ్ చేయాలనుకుంటారు. కానీ కొందరు మాత్రం అనుకున్నట్లు విడుదల చేస్తారు. మరికొందరు డ్రాప్ అవుతారు. ఏదేమైనా పొంగల్ కు కచ్చితంగా గట్టి పోటీ సాధారణ విషయమే.

అయితే 2025 సంక్రాంతిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఏ ఏ సినిమాలు వస్తాయోనని అంతా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కచ్చితంగా సంక్రాంతికి వస్తున్నారని అందరికీ క్లారిటీ వచ్చేసింది. ముందే అధికారికంగా ప్రకటించినా.. ఇప్పుడు టైటిల్ కు ట్యాగ్ లైన్ గా సంక్రాంతికి వస్తున్నారంటూ పెట్టి అనౌన్స్ చేశారు.

దీంతో చిరంజీవి తన కెరీర్ లో మరోసారి సంక్రాంతి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో బరిలో దిగనున్నారు. ఇప్పుడు ఆయనతోపాటు ఇంకా పెద్ద హీరోలు ఎవరెవరు రానున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. మాస్ మహారాజా రవితేజ రానున్నారని తెలుస్తోంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న పొంగల్ కే రిలీజ్ కానుందని వినికిడి.

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంగతేంటని అంతా మాట్లాడుకుంటున్నారు. ఆయన నటిస్తున్న రాజాసాబ్.. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పుడు కాదని.. సంక్రాంతికి విడుదలవుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కామెంట్స్ తో పొంగల్ కే రిలీజ్ అని క్లారిటీ వచ్చేసింది.

ఫ్యాన్స్ తో పాటు సౌత్ సినీ ప్రియులు సంక్రాంతికి రిలీజ్ చేయాలని, నార్త్ బయ్యర్లు డిసెంబర్ లో రిలీజ్ చేయాలని కోరుతున్నారని మాత్రమే చెప్పారు. దీనిబట్టి పొంగల్ బరిలో ప్రభాస్ ఉంటారని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయడం లేదు. రీసెంట్ గా మాళవిక మోహనన్ పోస్టర్ పై ఏకంగా ఏ డేట్ కూడా వేయలేదు.

అయితే రీసెంట్ గా టాలీవుడ్ లో కార్మికులు సమ్మె చేపట్టగా.. రాజాసాబ్ షూటింగ్ నిలిచిపోయింది. బంద్ ఎత్తేయడంతో మళ్లీ మొదలుకానుంది. సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా.. వాటిని శరవేగంగా డైరెక్టర్ మారుతి కంప్లీట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అనౌన్స్మెంట్ ఇస్తారని సమాచారం. మరి చూడాలి మేకర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో.. ఏ తేదీన రిలీజ్ అవుతుందో..

Tags:    

Similar News