చిన్న అపార్థం.. గొప్ప స్నేహాన్ని విడగొట్టిందా?

ఇద్దరు మనుషులు స్నేహంగా ఉంటే వారిని విడగొట్టడానికి ఎంతోమంది సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.;

Update: 2025-10-11 20:30 GMT

ఇద్దరు మనుషులు స్నేహంగా ఉంటే వారిని విడగొట్టడానికి ఎంతోమంది సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు ఆ స్నేహితుల మధ్య కూడా చిన్నచిన్న అపార్ధాలు విభేదాలకు దారితీసి మళ్ళీ మొహం చూసుకోనంత వరకు వెళ్తారు. అయితే అలాంటి ఒక చిన్న అపార్థమే ఓ ఇద్దరి మధ్య దూరం పెంచింది. ఆ అపార్థంతో మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ ఇప్పటివరకు కలవడం లేదు. మరి ఇంతకీ వాళ్ళు ఎవరు అంటే.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయిల్ దర్బార్.. సంజయ్ లీలా భన్సాలీ అంటే అందరికీ తెలిసిన పేరే.

అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయిల్ దర్బార్ ఎవరు అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఇప్పటి జనరేషన్ వాళ్లకు ఇస్మాయిల్ దర్బార్ తెలియకపోవచ్చు. కానీ ఆయన మ్యూజిక్ అందించిన అద్భుతమైన పాటలు వింటే చాలామంది ఇంత మంచి పాటల్ని అందించింది ఆయనేనా అనుకుంటారు. అయితే అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయిల్ దర్బార్.. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ మధ్య అప్పట్లో మంచి రిలేషన్ ఉండేది. వీరిద్దరూ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ బాండింగ్ తో ఉండేవారు. కానీ సడన్గా ఒక చిన్న అపార్థం వీరి మధ్య దూరాన్ని పెంచింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన హం దిల్ దే చుకే సనమ్ అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీ 1999లో వచ్చి అప్పటి సినీ ప్రియులను ఒక ఊపు ఊపేసింది. అంతేకాదు సినిమా ఇంత హిట్ అవ్వడానికి మరో కారణం ఈ సినిమాలోని మ్యూజిక్, పాటలే.. ఈ సినిమాకి ఇస్మాయిల్ దర్బార్ మ్యూజిక్ అందించారు. అలా అప్పటివరకు మాస్ మసాలా సాంగ్స్ తో నిండిపోయిన బాలీవుడ్లో ఇస్మాయిల్ దర్బార్ అందించిన మ్యూజిక్ ఎంతోమంది శ్రోతలను అలరించింది. పైగాఈ సినిమా హిట్ కొట్టడంతో మళ్లీ ఇస్మాయిల్ దర్బార్ - సంజయ్ లీలా భన్సాలీ కాంబోలో షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్ సినిమా వచ్చింది. ఈ సినిమా విషయంలోనూ మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. దాంతో ఈ జంటకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ సినిమాల తర్వాత మళ్లీ వీరి కాంబోలో ఏ ఒక్క సినిమా రాలేదు. దానికి కారణం ఒక చిన్న అపార్థమే.

అదేంటంటే..గత ఏడాది వచ్చిన హీరామండి వెబ్ సిరీస్ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ హీరామండి వెబ్ సిరీస్ ఇప్పుడు రావాల్సింది కాదట..పాతిక సంవత్సరాల క్రితమే రావాల్సిందట.ఆ సమయంలో ఓ జర్నలిస్టు తన దినపత్రికలో హీరామండికి ఇస్మాయిల్ దర్బార్ మ్యూజిక్ ఒక ఆయువు పట్టులాగా ఉంటుంది అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఆ దినపత్రికలో వచ్చిన స్టోరీ చూసి డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కోపం నషాలానికి ఎక్కిందట. అంతేకాదు ఇది డబ్బు ఇచ్చి మరీ ఇస్మాయిల్ రాయించుకున్నారని అపార్థం చేసుకున్నారు. దాంతో ఇస్మాయిల్ ని పిలిచి మరీ ఇక్కడితో ఇక చాలు అని సినిమాలతో పాటు ఫ్రెండ్షిప్ ని కూడా కట్ చేశారట. అయితే ఇస్మాయిల్ దర్బార్ ని చేయని తప్పకు నిందించడంతో ఆయన కూడా చాలా హర్ట్ అయ్యారట. ఆ తర్వాత వీరి మధ్య బంధం కట్ అయింది.

ఆ తర్వాత కొన్ని రోజులకి సంజయ్ లీలా భన్సాలీ పిఆర్ టీం ఇస్మాయిల్ తో కలవడానికి సకల ప్రయత్నాలు చేసినా కూడా ఇస్మాయిల్ దర్బార్ మళ్లీ కలవడానికి ఒప్పుకోలేదు.

మీరు 100 కోట్లు తెచ్చి నా ముందు పెట్టినా కూడా సంజయ్ తో సినిమా చేయను..ఆయనతో కలిసి సినిమా చేయడం నాకు ఇష్టం లేదు అని తెగేసి చెప్పారట. అలా సంజయ్ లీలా భన్సాలి తెలియక ఇస్మాయిల్ ని అపార్థం చేసుకోవడంతో ఇస్మాయిల్ దర్బార్ కూడా ఇప్పటివరకు ఆయనతో కలిసి మరో ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకోవడం లేదు.

అయితే చాలా సంవత్సరాల నుండి వీరి మధ్య వచ్చిన గొడవ ఏంటి..ఎందుకు విడిపోయారు అని ఎంతోమంది అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈ విషయం బయట పెట్టలేదు.కానీ రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయిల్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. ఇకపోతే ఏ ఆర్ రెహమాన్ కి ఆస్కార్ వచ్చిన తర్వాత ఈయన అసహనం వ్యక్తం చేయడంతో.. అప్పటినుంచి ఈయనకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

Tags:    

Similar News