బీటౌన్ లైఫ్ స్టైల్.. ఒక్క హీరోకి ఏకంగా 6 కారవాన్లా?
బాలీవుడ్ లో స్టార్ హీరోల లగ్జరీలు, షూటింగ్ సెట్స్ లో వారి కోసం ఉండే స్పెషల్ ఫెసిలిటీస్ గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది.;
బాలీవుడ్ లో స్టార్ హీరోల లగ్జరీలు, షూటింగ్ సెట్స్ లో వారి కోసం ఉండే స్పెషల్ ఫెసిలిటీస్ గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా చెప్పిన ఒక విషయమైతే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే ఒక్క స్టార్ హీరో కోసం షూటింగ్ సెట్స్ లో ఆరు కారవాన్లు అవసరం అవుతాయని ఆయన చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సంజయ్ గుప్తా చెప్పిన ప్రకారం, స్టార్ హీరోల స్టేటస్ పెరిగిన కొద్దీ వారి అవసరాలు పెరుగుతున్నాయి. అందుకే ఒక హీరో కోసం ఒకటి కాదు, ఆరు కారవాన్లు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇది కేవలం లగ్జరీ కోసం మాత్రమే కాదు, వర్క్ ప్రాసెస్ కోసం కూడా అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. మొదటగా, హీరోకు ఒక స్పెషల్ కారవాన్ ఉంటుంది. ఇందులో ఆయన రెస్ట్ తీసుకోవడం, స్క్రిప్ట్ చదవడం, షూట్ మధ్యలో రిలాక్స్ అవ్వడం వంటివి జరుగుతాయి.
దీన్ని మెయిన్ కారవాన్ గా భావిస్తారు. ఇక రెండో కారవాన్ ను హీరో మేకప్ కోసం ఉపయోగిస్తారు. హీరోకి మేకప్, హెయిర్ స్టైలింగ్ వంటి పనులు జరిగే ప్లేస్ అదే. మూడో కారవాన్ కాస్ట్యూమ్స్ కోసం ఉంటుంది. సినిమాల్లో హీరోలు రకరకాల డ్రెస్సులు మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి, వాటిని నీట్ గా ఉంచేందుకు ఒక కారవాన్ అవసరం అవుతుంది. నాలుగోది హీరో స్టాఫ్ కోసం ఉంటుంది. ఇందులో ఆయన మేనేజర్, అసిస్టెంట్లు, పర్సనల్ టీమ్ ఉంటారు.
ఐదో కారవాన్ ను జిమ్ లేదా ఫిట్ నెస్ అవసరాల కోసం ఉపయోగిస్తారు. చాలామంది స్టార్ హీరోలు తమ ఫిట్ నెస్ పై ఎక్కువగా దృష్టి పెడతారు. షూటింగ్ సమయంలో కూడా వర్కౌట్స్ చేయడానికి వీలుగా ప్రత్యేకంగా ఆ కారవాన్ ఏర్పాటు చేస్తారు. ఇక ఆరవ కారవాన్ ను సెక్యూరిటీ లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఆ విధంగా ఒక హీరో కోసం ఆరు కారవాన్లు ఏర్పాటు చేయాల్సి రావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో సాధారణమైందని సంజయ్ గుప్తా తెలిపారు.
గతంలో ఇలాంటి సౌకర్యాలు చాలా రేర్ గా ఉండేవని, కానీ ఇప్పుడు స్టార్ కల్చర్ పెరగడంతో ఇవి సాధారణంగా మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారగా.. సోషల్ మీడియాలో మిక్స్ డ్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. కొందరు ఇది అతిగా ఉందని విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం స్టార్ హీరోల ఇమేజ్, పని ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు అవసరమేనని అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, ఒక స్టార్ హీరో కోసం ఆరు కారవాన్లు ఏర్పాటు చేయాల్సి రావడం సినీ ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్ కు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలి. హీరోల ఇమేజ్, మార్కెట్, ప్రొడక్షన్ వ్యాల్యూస్.. అన్నీ కలిపి ఆ విధమైన ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఫ్యూచర్ లో ఇంకా పెరిగే అవకాశముందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.