ప్రభాస్, రణ్వీర్ అలా చేయరని అనుకుంటున్నా- ఎందుకంటే?
అయితే రెండు సినిమా రిలీజ్ లు క్లాష్ అవ్వడంపై సంజయ్ దత్ మాట్లాడారు.;
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీలక పాత్రలో లోనే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'డబుల్ ఇస్మార్ట్'లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక ఆయన ప్రస్తుతం పలు చిత్రాలతో బీజీగా ఉన్నారు. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ 'రాజాసాబ్', బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ 'దురంధర్' సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాలకు సంబంధించిన రెండు టీజర్లు విడుదల అయ్యాయి. ఈ రెండింట్లోనూ సంజయ్ ది కీలక పాత్ర అని టీజర్ చూస్తే అర్థమైపోతోంది. ఇటు టాలీవుడ్ లో రాజాసాబ్, అటు బాలీవుడ్ లో దురంధర్ సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే రెండు సినిమాలో ఒకే రోజు డిసెంబర్ 05న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే రెండు సినిమా రిలీజ్ లు క్లాష్ అవ్వడంపై సంజయ్ దత్ మాట్లాడారు. ఆయన లీడ్ రోల్ లో నటించిన KD ది డెవిల్ సినిమాలో నటించారు. ఈ సినిమా టీజర్ గురువారం రిలీజ్ అయింది. ఈ క్రమంలో మేకర్స్ టీజర్ రీలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సంజయ్కు రాజాసాబ్, దురంధర్ సినిమా రిలీజ్ క్లాష్ గురించి మీడియా క్వశ్చన్ అడిగారు.
రీసెంట్గా రిలీజ్ అయిన రాజాసాబ్, దురంధర్ రెండు టీజర్లలో మీ లుక్ సూపర్ గా ఉంది. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానున్నాయి. ఒకే రోజు ఫ్యాన్స్ మిమ్మల్ని రెండు డిఫరెంట్ లుక్స్ లో చూడనున్నారు. మరి ఈ క్లాష్ గురించి మీరు ఏమంటారు? అని అడిగిన ప్రశ్నకు సంజయ్ ఇలా సమాధానం ఇచ్చారు.
రాజాసాబ్, దురంధర్ రెండు సినిమాల్లో నాది భిన్నమైన పాత్రలు. ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర. ప్రేక్షకులు నా పాత్రను ఎంజాయ్ చేస్తారు. అందుకే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావొద్దని కోరుకుంటున్నా. అలా కావనే అనుకుంటున్నాను కూడా. ఎందుకంటే ఒక్కో సినిమాకు ఒక్కో జర్నీ ఉంటుంది.
కాగా, KD ది డెవిల్ సినిమాను ప్రేమ్ తెరకెక్కించారు. ఇందులో సంజయ్ దత్తోపాటు శిల్పా శెట్టి, ధ్రువ్ రార్జ, పూనమ్ జవార్, రమేశ్ అరవింద్, వీ రవిచంద్రన్, నోరా ఫతేహీ ఆయా పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2026 జూలై 10న రిలీజ్ కానుంది.