సంజయ్ దత్ కామెంట్స్.. లోకేష్ కనగరాజ్ ఏమన్నారంటే?

ఆ నేపథ్యంలో ఇప్పుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. తన అప్ కమింగ్ మూవీ కూలీ ప్రమోషన్స్ లో భాగంగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు.;

Update: 2025-07-15 09:01 GMT

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ గురించి అందరికీ తెలిసిందే. తన యాక్టింగ్ తో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన ఆయన.. ఇప్పుడు సౌత్ ఫై ఫోకస్ పెట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించారు.

కేజీఎఫ్ 2లో విలన్ గా నటించి ఆకట్టుకున్న సంజయ్.. ఆ తర్వాత కోలీవుడ్ లో లియో మూవీలో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ది రాజా సాబ్, అఖండ 2 వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. కన్నడలో కేడీ ది డెవిల్ మూవీలో నటిస్తున్నారు. ఆ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లియో మూవీలో యాక్ట్ చేయడం ఆనందంగానే ఉందని, కానీ డైరెక్టర్ పై కోపం ఉందని అన్నారు. ఎందుకంటే తన రోల్ చాలా చిన్నదని, ఇమేజ్ కు తగ్గట్లు పాత్రను డిజైన్ చేయలేదని వ్యాఖ్యానించారు.

తన టైమ్ వేస్ట్ అయిందంటూ నవ్వుతూ అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ చక్కర్లు కొట్టడంతో.. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అయ్యారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. తన అప్ కమింగ్ మూవీ కూలీ ప్రమోషన్స్ లో భాగంగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

సంజయ్ సార్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఆయన నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని లోకేష్ తెలిపారు. తాను ఫన్నీగా కామెంట్ చేశానని సంజయ్ చెప్పినట్లు వెల్లడించారు. కానీ సోషల్ మీడియాలో మరో రకంగా రీచ్ అయ్యాయని తెలిపినట్లు చెప్పారు. ఇబ్బందిగా అనిపించిందని కూడా సంజయ్ చెప్పారట.

దీంతో తాను పర్వాలేదు సార్‌ ఇలాంటివి సహజమేనని చెప్పినట్లు తెలిపారు. తాను గొప్ప ఫిల్మ్ మేకర్‌ ను కాదు, ఇంకా నేర్చుకోవడంలోనే ఉన్నానని అన్నట్లు చెప్పారు. అయితే తాను భవిష్యత్తులో సంజయ్‌ దత్‌ కోశ. అత్యుత్తమమైన పాత్రను రెడీ చేస్తానని ప్రకటించారు. మరో సినిమాతో ఆ తప్పును కచ్చితంగా సరిదిద్దుకుంటానని అన్నారు. ఇప్పుడు లోకేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News