బిగ్ బాస్ కంటెస్టెంట్ కి డ్రగ్స్ కేసు చిక్కు..?

ఐతే సంజన గర్లాని ఈ కేసు విషయమై చాలా పోరాడింది. కర్ణాటక హైకోర్టు సంజనకు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు ఇచ్చింది.;

Update: 2025-09-28 06:41 GMT

సినీ సెలబ్రిటీస్ కు డ్రగ్స్ కేసుతో లింక్ పెట్టి వార్తలు రాయడం కామన్. ఐతే కొందరు సినీ ప్రముఖులు డ్రగ్స్ కు బానిస అవ్వడమే కాకుండా డ్రగ్స్ ని తమ ద్వారా మరికొందరికి సప్లై చేస్తుంటారు. టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం అంటూ అప్పుడప్పుడు హడావిడి తెలిసిందే. ఐతే కర్ణాటకలో కూడా సినీ సెలబ్రిటీస్ డ్రగ్స్ వాడుతున్నారన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అందులో ముఖ్యంగా హీరోయిన్ సంజన గర్లాని కీలక వ్యక్తిగా చెప్పుకొచ్చారు.

డ్రగ్స్ కేసులో సంజనా..

ఐతే సంజన గర్లాని ఈ కేసు విషయమై చాలా పోరాడింది. కర్ణాటక హైకోర్టు సంజనకు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఐతే సంజన తో పాటు మరికొందరు ఈ కేసు లో ఉండగా కర్ణాటక హైకోర్టు నుంచి కేసుని సుప్రీం కోర్ట్ కి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ అమన్ పన్వర్ సుప్రీం కోర్టులో తమ వాదనలను వినిపించారు. దాంతో సంజనతో పాటు ఆ డ్రగ్స్ కేసుకి సంబంధించిన వారందరికీ సుప్రీం మళ్లీ నోటీసులు పంపించింది.

ఐతే ప్రస్తుతం సంజన గర్లాని తెలుగు బిగ్ బాస్ లో ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఆమె వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తుంది. హౌస్ మెట్స్ తో ప్రతి విషయానికి గొడవ పడుతున్న ఆమె తన దొంగతనాలతో హడావిడి చేస్తుంది. హౌస్ లో తాను ఉన్నన్నాళ్లు ఇలానే చేస్తా అని అంటుంది సంజన. మరి సుప్రీం నోటీసులు ఇచ్చిన ఈ టైం లో సంజన కేసు విషయమై కోర్టుకి హాజరు అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ సీజన్ 9 లో సంజన గర్లాని..

సంజన గర్లాని ఐదు నెలల బేబీని వదిలి బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్టు తెలుస్తుంది. సీజన్ 9 లో జరిగిన 3 వారాల ఆట చూస్తే ఉన్న వాళ్లలో ఆమె మెంటల్లీ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. హౌస్ లో ఫిజికల్ టాస్క్ ఏమో కానీ మాటల యుద్ధంలో సంజన గెలిచేలా ఉన్నారు. ఆమెతో పాటు ఆమెకు సపోర్ట్ గా ఇమ్మాన్యుయెల్, తనూజ, రీతు చౌదరి కూడా సంజన తో క్లోజ్ గా ఉంటున్నారు.

మామూలుగా అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా కూడా కోర్ట్ ఇష్యూస్ ఉంటే తప్పకుండా బయటకు వచ్చి దాన్ని చూసుకుంటారు. సంజన విషయంలో మ్యాటర్ సీరియస్ అయితే మాత్రం ఆమె బయటకు వచ్చి కోర్టులో హాజరయ్యే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News