అండాన్ని ఫ్రీజ్ చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌పై సానియా మిర్జా

యువ‌తులు ఇటీవ‌లి కాలంలో అండాన్ని (ఎగ్) ఫ్రీజింగ్ చేయ‌డం గురించి ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్నారు.;

Update: 2025-11-18 04:00 GMT

యువ‌తులు ఇటీవ‌లి కాలంలో అండాన్ని (ఎగ్) ఫ్రీజింగ్ చేయ‌డం గురించి ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్నారు. దీనికి ప్రేర‌ణ‌నిచ్చింది మాత్రం సెల‌బ్రిటీలే. ఉపాస‌న కామినేని, ప్రియాంక చోప్రా స‌హా చాలా మంది అగ్ర క‌థానాయిక‌లు అండాన్ని దాచి ఉంచాల‌నే భ‌విష్య‌త్ ఆలోచ‌న‌కు మ‌ద్ధ‌తు ప‌లికారు. ఒక వ‌య‌సు దాటాక పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్టం గ‌నుక‌, యుక్త‌వ‌య‌సు అమ్మాయి అండాన్ని ఫ్రీజ్ చేసి ఉంచ‌డం ఎంతో శ్రేయ‌స్క‌రం.

తాజా పాడ్ కాస్ట్ లో మాజీ టెన్నిస్ ఛాంపియన్ సానియా మీర్జా కూడా తాను అండాన్ని ఫ్రీజ్ చేయించిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు ఇజాన్ పుట్టిన తర్వాత తన అండాలను ఫ్రీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, ఇది భవిష్యత్తు కోసం ఒక ఆచరణాత్మక అడుగు అని అన్నారు. మొదటిసారి సహజంగా గర్భం దాల్చినా కానీ, ఆ వెంటనే తన అండాలను నిల్వ చేయాలని నిర్ణయించుకున్నానని సానియా తెలిపారు. త‌న స్నేహితురాలు ఫరా ఖాన్‌ను సంప్రదించి దీనిపై అభిప్రాయం కోరాన‌ని మీర్జా తెలిపారు. ఒక నిపుణుడిని సంప్ర‌దించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఫ‌రా సూచించిన‌ట్టు సానియా వెల్ల‌డించారు.

గ‌డువు ముగిసాక కూడా కుటుంబాన్ని విస్త‌రించాల‌ని నిర్ణ‌యించుకుంటే, ఎగ్ ఫ్రీజింగ్ మంచి ఆలోచ‌న అని సానియా అన్నారు. తాను అండాన్ని ఫ్రీజ్ చేసే ప్ర‌క్రియ చేయించుకున్న‌ట్టు కొంద‌రికి తెలుసున‌ని కూడా సానియా అన్నారు. వృత్తిపరమైన, ఆరోగ్య సంబంధిత లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పుడు చాలా మంది మహిళలు రెండవ గర్భధారణను ఆలస్యం చేయాలని భావిస్తున్నారు. ఇది పునరుత్పత్తి సామ‌ర్థ్యాన్ని త‌గ్గిస్తుంది.

అండాశ‌యంలో గుడ్ల సంఖ్య, గుడ్ల‌ నాణ్యత సాధారణంగా కాలక్రమేణా తగ్గుతాయి.. ముప్పైల ప్రారంభంలో లేదా మొదటి డెలివరీ తర్వాత వెంటనే గుడ్లను ఫ్రీజ్ చేయ‌డం వల్ల భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశం లభిస్తుంది. అండాశయ నిల్వలు తగ్గే ముందు మహిళలు ఆరోగ్యకరమైన గుడ్లను సంరక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 28 - 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఈ ప్రక్రియను పరిగణించాలని వైద్యులు సాధారణంగా సిఫార్సు చేస్తున్నారు. ఇటీవ‌లి పాడ్ కాస్ట్ లో సానియా త‌న మాజీ భ‌ర్త నుంచి విడిపోవ‌డం గురించి మాట్లాడారు. విడాకుల ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో ప్యానిక్ అయిన‌ట్టు సానియా వెల్ల‌డించారు.

Tags:    

Similar News