కింగ్డమ్ పక్కా హిట్.. సందీప్ వంగా ఫస్ట్ రివ్యూ..

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-07-26 04:03 GMT

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఆ మూవీలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ మూవీ జులై 31వ తేదీన విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి స్పందన రాగా.. శనివారం ట్రైలర్ విడుదల చేయనున్నారు.

ఇంతలో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరితో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆయనే హోస్ట్‌ గా వ్యవహరించారు. అందుకు సంబంధించిన ఫుల్ వీడియో మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో సందీప్ కింగ్డమ్ మూవీపై తన మొదటి రివ్యూ ఇచ్చారు.




 


50 నిమిషాలపాటు సినిమాను చూశానని సందీప్ తెలిపారు. ఆర్‌ ఆర్ లేకపోయినా బాగా కనెక్ట్ అయ్యానని వెల్లడించారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే.. సినిమా చూసినప్పుడు బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ లేద‌నే విషయం తాను మర్చిపోయానని చెప్పిన సందీప్.. అంతగా లీనమయ్యానని పేర్కొన్నారు. ఆసక్తికరంగా సీన్స్ ఉన్నాయని చెప్పారు.

ప్రతి మూమెంట్ ఎంగేజింగ్ గా ఉందని చెప్పారు. అయితే అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ చాలా ఫ్రెష్‌ గా ఉంటుందని, ఆర్ఆర్ అద్భుతంగా ఉండబోతుందన్నారు. నిజానికి అనిరుధ్ కు ఇది కొత్త జోనర్ మూవీ అని అన్నారు. అందుకే స్పెషల్ గా ఆయన వర్క్ ఉండనుందని వ్యాఖ్యానించారు. ఆడియన్స్ కు ఫీస్ట్ అని హామీ ఇచ్చారు.

సినిమాతో హిట్ కొట్టేశారని రివ్యూ ఇచ్చారు. విజయ్ దేవరకొండ పవర్‌ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలో విజయ్ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలిపారు. లుక్స్ అదిరిపోయాయని చెప్పారు. ఇప్పుడు సందీప్ కామెంట్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని చెప్పాలి.. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News