సందీప్ రెడ్డి కుమారుడి పేరే ఆ టైటిల్!
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సందీప రెడ్డి వంగా తెరకెక్కించిన `అర్జున్ రెడ్డి` ఎంత పెద్ద విజయం సాధించిందే తెలిసిందే.;
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సందీప రెడ్డి వంగా తెరకెక్కించిన 'అర్జున్ రెడ్డి' ఎంత పెద్ద విజయం సాధించిందే తెలిసిందే. ఇదే సినిమా బాలీవుడ్ లో 'కబీర సింగ్' టైటిల్ తో రీమేక్ చేసి అక్కడా సంచలనం చేసాడు సందీప్. ఇలా ఒక్క సినిమాతోనే సందీప్ రెడ్డి టాలీవుడ్ సహా బాలీవుడ్ ని షేక్ చేసాడు. తొలి సినిమాతోనే తానో సంచలనమని నిరూపించాడు. రాంగో పాల్ వర్మ లాంటి దిగ్గజంతోనే షెభాష్ అనిపించుకున్న దర్శకుడు. అటుపై `యానిమల్` సినిమాతో ఇండియానే షేక్ చేసాడు.
ఆ సంగతి పక్కన బెడితే? అసలు 'అర్జున్ రెడ్డి' టైటిల్ ఎలా పుట్టింది? ప్రత్యేకంగా ఆటైటిలే తొలి సినిమాకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే? ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు సందీప్. ఆ సినిమా మొదలు పెట్టే సమయానికి సందీప్ సతీమణి గర్భవతిగా ఉన్నారుట. అటుపై ప్రసవం అనం తరం అర్జున్ రెడ్డి అని కుమారుడికి నామ కరణం చేసారు. దీంతో అదే టైటిల్ తన తొలి సినిమాకు కూడా పెట్టినట్లు సందీప్ తెలిపాడు. అంతకు మించి `అర్జున్ రెడ్డి` టైటిల్ వెనుక మరో కారణం లేదన్నారు.
అలా విజయ్ దేవరకొండ సినిమాలో అర్జున్ రెడ్డి అయ్యాడు. ఆ టైటిల్ కూడా క్యాచీగా పవర్ పుల్ గా ఉండ టంతో ప్రేక్షకుల్లో ఈజీగా వెళ్లింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానా యకుడిగా 'స్పిరిట్' చిత్రాన్ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇదీ సందీప్ మార్క్ పవర్ పుల్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. డార్లింగ్ ఇంత వరకూ కాప్ రోల్ పోషించలేదు. దీంతో పవర్ పుల్ పోలీస్ ఎలా ఉంటాడు? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పాత్రపై మాత్రం ప్రేక్షకాభిమానులంతా చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. పోలీస్ పాత్రలకే కొత్త అర్దం తెచ్చే లా ఆ రోల్ ఉంటుంది? అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా సందీప్ సినిమాలో హీరోల పాత్రలు డిజైన్ చేయబడతాయి. క్యారెక్టరేజేషన్ తోనే కథను నడపగల దర్శకుడు. మేకింగ్..టేకింగ్ తో స్పిరిట్ ని నెక్స్ట్ లెవల్లో చూపిస్తాడని అందరిలోనూ అంచనాలున్నాయి. అలాంటి డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి స్టార్ దొరికితే? అది ఊహకే అందని అంచనా. త్వరలోనే ఈసినిమా ప్రారంభం కానుంది.