'స్పిరిట్' లో కాస్టింగ్ గెస్సింగ్ అంత ఈజీనా?
కానీ సందీప్ లో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. కథ, అందులో పాత్రలు డిమాండ్ చేస్తే ఎంత పేరున్న నటుడైనా దించగల సమర్దుడు.;
డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` మొదలైంది. ఇందులో ప్రభాస్ కి జోడీగా త్రిప్తీ డిమ్రీ నటిస్తుంది. ఓ పవర్ పుల్ పాత్రలో కొరియన్ నటుడు డాన్ లీ అలియాస్ మాడాంగ్ సియోక్ నటిస్తున్నాడు. ఇప్పటి వరకూ సినిమాలో అధికారికమైన పేర్లు ఇవే. కానీ సందీప్ సినిమాలో పాత్రలు ఎంత బలంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రధాన పాత్రల నుంచి చిన్న చితకా పాత్రల వరకూ అంతే స్ట్రాంగ్ గా కనిపి స్తుంటాయి. ఈ నేపథ్యంలో సినిమాలో భారీ తారాగణం ఉంటుందనే ప్రచారం తొలి నుంచి జరుగుతుంది.
రణబీర్ కపూర్ మాత్రం రెడీగా:
ఈ నేపథ్యంలోనే చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్ర పోషిస్తున్నాడనే ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని సందీప్ కొట్టపారేసాడు. అలాగే సంజయ్ దత్ కూడా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంకా రణబీర్ కపూర్ కూడా భాగమయ్యే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. `స్పిరిట్` ను గనుక యూనివర్శ్ గా ప్రకటిస్తే అందులో తాను కూడా భాగమవుతానని రణబీర్ ఓపెన్ గానే ప్రకటించాడు. బాలయ్య `అన్ స్టాపబుల్` షో వేదికగా ఈ విషయం వెల్లడించాడు. కాబట్టి `స్పిరిట్` లో ఏ పాత్రలోనైనా రణబీర్ ని దించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఊపందుకుంది.
పాత్రలతో ఇమేజ్ తీసుకొచ్చే డైరెక్టర్:
కానీ సందీప్ లో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. కథ, అందులో పాత్రలు డిమాండ్ చేస్తే ఎంత పేరున్న నటుడైనా దించగల సమర్దుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ సందీప్ వైఖరి మాత్రం అందుకు భిన్నంగా ఉం టుంది. తాను రాసిన కథలో ఎలాంటి ఇమేజ్ లేని నటుడైనా ఆ పాత్రకు సూటవుతున్నాడంటే? అతన్నే ఎంపిక చేస్తాడు. అవసరమైతే రెండు కోట్లు ఎక్కువ పారితోషికం ఇచ్చి తీసుకొస్తాడు. అంతేగానీ హీరోల ఇమేజ్ తో సినిమాను నడిపించే దర్శకుడు కాదు. అందుకే స్టార్ హీరోలే అతడితో సినిమా చేయాలని క్యూలో ఉన్నారు.
వర్మ రూల్ పాటిస్తున్నాడు:
కొరియా నుంచి డాన్ లీని తీసుకొస్తున్నాడు? అంటే ఆ రోల్ కి అతడే సూటవుతాడు కాబట్టి! లేదంటే ఇండియాలో నటులే లేక కాదుగా. ఈ విషయంలో సందీప్ కూడా రాంగోపాల్ వర్మని అనుసరిస్తుంటాడు. యానిమల్ లో నటించిన త్రిప్తీ డిమ్రీ ఆ సినిమా రిలీజ్ ముందు వరకూ పెద్దగా తెలియని నటే. చేసిన సినిమాలన్నీ ప్లాపే. కానీ `యానిమల్` లో పాత్రతో ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. బాలీవుడ్ లో బిజీ స్టార్ అయింది. బాలీవుడ్ లో ఎంతో మంది ఫేమస్ హీరోయిన్లు ఉన్నా? త్రిప్తీనే ఎందుకు తీసుకున్నారంటే? ఆ పాత్ర తనకు మాత్రమే సెట్ అవుతుందని రాసుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయంగా చెప్పాడు సందీప్.