కాంతారా 1 పై సందీప్ వంగ రివ్యూ.. ట్రూ మాస్టర్ పీస్..!

రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఐతే ఈ సినిమాను యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు.;

Update: 2025-10-03 07:18 GMT

రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఐతే ఈ సినిమాను యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. కాంతారా చాప్టర్ 1 పై తన ట్రూ రివ్యూ ఇస్తూ ఇది ట్రూ మాస్టర్ పీస్ అన్నాడు. ఇండియన్ సినిమాల్లో ఇదివరకు ఎప్పుడు చూడలేదని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఇది సినిమాటిక్ థండర్ స్ట్రోం, రా, డివైన్, అన్ షేకబుల్ అంటూ చెప్పాడు. రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో దీన్ని చాలా అందంగా ఒంటి చేత్తో క్యారీ చేశాడని అన్నారు. స్పెషల్ మెన్షన్ గా అజనీష్ బిజిఎం ని మెచ్చుకున్నారు సందీప్ వంగ.

కాంతారా చాప్టర్ 1 మీద హైప్ ఒక రేంజ్ లో..

కాంతారా ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చాప్టర్ 1 పై ఉన్న అంచనాలు తెలిసిందే. రిషబ్ శెట్టి కాంతారా తీసి హిట్ కొడితే అది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సర్ ప్రైజ్ హిట్ అందుకుంది. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 మీద హైప్ ఒక రేంజ్ లో ఉంది. దాన్ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. రిషబ్ శెట్టి ఆ కష్టాన్ని పడి ఫైనల్ గా సక్సెస్ అందుకున్నాడు. ఓ పక్క అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలతో బాలీవుడ్ ని షేక్ చేసిన సందీప్ వంగ లాంటి డైరెక్టర్ ఈ సినిమాను మాస్టర్ పీస్ అనడం సంచలనంగా మారింది.

సందీప్ వంగ ఇచ్చిన కాంతారా చాప్టర్ 1 రివ్యూ చాలా మంది ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఎందుకంటే సినిమా విజువల్ ట్రీట్ అని అందరు అంటున్నా.. రివ్యూస్ అన్నీ బాగున్నా సోషల్ మీడియాలో కొందరు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ సందీప్ వంగ లంటి ఫిల్మ్ మేకర్ కి మాస్టర్ పీస్ అనిపించింది అంటే తప్పకుండా సినిమా సంథింగ్ స్పెషల్ అన్నట్టే లెక్క.

సందీప్ వంగ ఇచ్చిన కాంతారా 1 రివ్యూ..

కాంతారా చాప్టర్ 1 కోసం రిషబ్ శెట్టి పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చిందని చెప్పొచ్చు. ఐతే సందీప్ వంగ ఇచ్చిన కాంతారా 1 రివ్యూకి రిప్లై గా రిషబ్ శెట్టి కూడా థాంక్ యు బ్రదర్ అని కామెంట్ ఇచ్చి లవ్ సింబల్ పెట్టారు. ఆల్రెడీ కాంతారా చాప్టర్ 1 కి సూపర్ హిట్ టాక్ రాగా లేటెస్ట్ గా సందీప్ వంగ వేసిన ట్వీట్ మరింత క్రేజ్ తెచ్చుకుంది.

కాంతారా చాప్టర్ 1 లో రిషబ్ శెట్టి యాక్టింగ్ కి ఎన్ని అవార్డులు ఇచ్చినా సరిపోదు అని చెప్పేస్తున్నారు. రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో ఆల్రెడీ నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. మళ్లీ కాంతారా చాప్టర్ 1 తో కూడా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అవార్డులు సైతం అందుకునేలా ఉన్నాడని చెప్పొచ్చు.

Tags:    

Similar News