సుకుమార్, మారుతి, కొరటాల.. అదే రూట్ లో సందీప్ వంగా

టాలీవుడ్ కు చెందిన అనేక మంది దర్శకులు.. ఓవైపు సినిమాలు తెరకెక్కిస్తూ.. మరోవైపు చిత్ర నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకుంటున్నారు.;

Update: 2025-09-25 06:22 GMT

టాలీవుడ్ కు చెందిన అనేక మంది దర్శకులు.. ఓవైపు సినిమాలు తెరకెక్కిస్తూ.. మరోవైపు చిత్ర నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు మద్దతు తెలుపుతున్నారు. అలా అటు దర్శకులుగా.. ఇటు నిర్మాతలుగా బిజీగా గడుపుతున్నారు. ఆ జాబితాలో ఇప్పటికే పలువురు డైరెక్టర్లు ఉన్న విషయం తెలిసిందే.

తెలుగు సినీ దర్శకులు సుకుమార్, మారుతి, కొరటాల శివ సహా పలువురు డైరెక్టర్స్.. తమ సొంత నిర్మాణ సంస్థల ద్వారా పలు సినిమాలకు ఇప్పటికే సమర్పకులుగా వ్యవహరించారు.. వ్యవహరిస్తున్నారు కూడా. అందులో ఎక్కువగా చిన్న చిత్రాలే ఉండటం గమనార్హం. ఇప్పుడు అదే జాబితాలోకి సందీప్ రెడ్డి వంగా కూడా చేరనున్నారు.

దర్శకుడిగా తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకున్న సందీప్ వంగా.. ఇప్పుడు నిర్మాతగా ఓ సినిమాను రూపొందించనున్నట్లు రీసెంట్ గా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన బ్రదర్ ప్రణయ్ నిర్మాతగా ఉండగా.. ఇప్పుడు సందీప్ కూడా ప్రొడ్యూసర్ గా మారనున్నారు. చిన్న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సుకుమార్, మారుతి, కొరటాల శివ సహా పలువురు ఉన్న జాబితాలోకి చేరి భద్రకాళి ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమాపై సందీప్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అందుకు రంగం సిద్ధం చేస్తున్నారని.. త్వరలో ప్రకటిస్తారని సమాచారం. మేం ఫేమస్ ఫేమ్ సుమంత్ అశ్విన్, మలయాళ యంగ్ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్స్ లో నటించనున్నారని వినికిడి.

లేడీ ఓరియెంటెడ్ మూవీ 8 వసంతాలుతో మంచి పేరు సంపాదించుకున్న అనంతిక.. ఇప్పుడు సందీప్ తో వర్క్ చేయనుందన్నమాట. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సందీప్ వంగా నిర్మించనున్న మూవీ ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాతో వేణు అనే కొత్త దర్శకుడు.. టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమవ్వనున్నారని వినికిడి.

అదే సమయంలో తెలంగాణలోని వరంగల్ కు చెందిన సందీప్.. మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికే తెలంగాణ నేపథ్యంతో వచ్చిన వివిధ సినిమాలకు మద్దతు పలికిన ఆయన.. ఇప్పుడు ఇక్కడ కథలతో సినిమాలు తీయనున్నారని ప్రచారం జరుగుతోంది. మరిన్ని చిత్రాలు నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి సందీప్ నిర్మించనున్న సినిమాలు ఎలాంటి విజయాలు సాధిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News