సందీప్ నుంచి మరో ఫ్రాంచైజ్?
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు యూనివర్స్‌లలో సినిమాలు రాగా ఇప్పుడు మరో యూనివర్స్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.;
ఈ మధ్య ఓ యూనివర్స్ సృష్టించడం, అందులో సినిమాలు తీయడం డైరెక్టర్లకు ఫ్యాషనైపోయింది. ట్రెండ్ కు తగ్గట్టు తమ కథలను మార్చుకుంటూ ఒక యూనివర్స్ ను సృష్టించి సినిమాలు తీస్తూ, ఆ యూనివర్స్ కథల్లో ముందు వచ్చిన వాటిని లింక్ చేసుకుంటూ సినిమాలు చేసి ఆడియన్స్ ను అలరించడంతో పాటూ ముందు నుంచే సినిమాకు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
ప్రభాస్ తో సందీప్ స్పిరిట్
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు యూనివర్స్‌లలో సినిమాలు రాగా ఇప్పుడు మరో యూనివర్స్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ఫ్రాంచైజ్ ను తీయాలనుకుంటున్న డైరెక్టర్ మరెవరో కాదు. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా రానున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సందీప్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
యానిమల్ ఫ్రాంచైజ్ లో సినిమాలు
స్పిరిట్ సినిమా ఇంకా మొదలు కూడా కాలేదు కానీ అప్పుడే ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. స్పిరిట్ గురించి వినిపిస్తున్న వార్తలు రోజురోజుకీ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. స్పిరిట్ సినిమాను వంగా ఓ ఫ్రాంచైజ్ గా మార్చాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఆల్రెడీ యానిమల్ మూవీ తర్వాత దానికి ఫ్రాంచైజ్ ను సృష్టించి అందులో సినిమాలు చేయాలని ప్లాన్ చేసిన వంగా ఇప్పుడు స్పిరిట్ ను కూడా ఫ్రాంచైజ్ గా మార్చాలని చూస్తున్నారట.
కాప్ యూనివర్స్ ను సృష్టించనున్న సందీప్
స్పిరిట్ ను మంచి సస్పెన్స్ క్లైమాక్స్ తో ముగించి, నెక్ట్స్ మూవీలో ఏం జరగనుందో అనేలా ఆడియన్స్ కు ఎగ్జైట్‌మెంట్ ను కలిగించి ఆ తర్వాత మరో భాగాన్ని తీయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం, స్పిరిట్ లో ప్రభాస్ చేసే పోలీస్ క్యారెక్టర్ చుట్టూ ఓ యూనివర్స్ ను నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, అందులో భాగంగా మొదటిగా వచ్చే స్పిరిట్ ను మంచి క్లైమాక్స్ తో ముగించేలా సందీప్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
విభిన్న లుక్స్ లో కనిపించనున్న ప్రభాస్
ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమాను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్న డార్లింగ్, ఆ సినిమా పూర్తై జనవరిలో రిలీజైన వెంటనే 2026 ఫిబ్రవరి నుంచి స్పిరిట్ అనే భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. త్రిప్తీ డిమ్రీ హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ ముంబైలో జరగనుండగా, ఆ తర్వాత మెక్సికో, ఇండోనేషియా, థాయ్‌లాండ్ లాంటి ఇంటర్నేషనల్ లొకేషన్లలో స్పిరిట్ షూటింగ్ జరుపుకోనుంది. స్పిరిట్ కోసం ఇప్పటికే ప్రభాస్ కు లుక్ టెస్ట్ జరగ్గా, మేకర్స్ ఆయనకు రెండు విభిన్న లుక్స్ ను ఫిక్స్ చేశారు. సినిమాలో వచ్చే ఓ ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్ ను ముంబై షెడ్యూల్ లో షూట్ చేయనున్నారని సందీప్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.