ప్రభాస్, త్రిప్తి డిమ్రి మధ్య ఏం జరిగింది?

రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ పెంచారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.;

Update: 2025-12-03 13:52 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ పెంచారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రభాస్ తాజా షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ షెడ్యూల్ లో జరిగిన షూటింగ్ వివరాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.

ఈ షెడ్యూల్ అంతా జైలు సెటప్ లోనే సాగింది. సినిమా ప్రారంభమే ఇంత ఇంటెన్స్ గా ఉందంటే, వంగా ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి రెండు రోజులు పూర్తిగా జైలు నేపథ్యంలో సాగే సీరియస్ సన్నివేశాలను చిత్రీకరించారట. ఖైదీల మధ్య, పోలీసుల మధ్య ఉండే ఆ వాతావరణాన్ని సందీప్ చాలా రా గా, రస్టిక్ గా క్యాప్చర్ చేశారని టాక్ వినిపిస్తోంది.

కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఈ షెడ్యూల్ లో ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ సీన్స్ కూడా జరిగాయి. హీరోయిన్ త్రిప్తి డిమ్రి, ప్రభాస్ మధ్య వచ్చే కొన్ని కీలకమైన సీన్స్ ని ఈ జైలు సెట్ లోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే ఈ సీన్స్ సినిమాలో చాలా కీలకం కానున్నాయట. ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, త్రిప్తి పాత్రతో జరిపే ఈ సంభాషణలు ఎమోషనల్ గా ఉంటాయని సమాచారం.

సందీప్ వంగా సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ట్రాక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా, బలమైన ఎమోషన్స్ తో కూడి ఉంటుంది. ఇప్పుడు జైలు సీన్లు ఫినిష్ అవ్వడంతో, వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అయ్యిందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. త్రిప్తి డిమ్రి నటనకు, ప్రభాస్ స్క్రీన్ ప్రెజన్స్ కు ఈ సీన్స్ అదిరిపోతాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఎక్కడా గ్యాప్ లేకుండా, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ ముగించేస్తున్నారు. దర్శకుడు కూడా ప్రీ ప్రొడక్షన్ లోనే అన్ని పనులు పూర్తి చేసుకోవడంతో సెట్స్ మీద సమయం వృథా కావడం లేదట. ప్రభాస్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ షెడ్యూల్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఫస్ట్ షెడ్యూల్ ను సక్సెస్ ఫుల్ గా, అనుకున్న సమయానికి పూర్తి చేశారు. జైలు గోడల మధ్య ప్రభాస్ చూపించిన విశ్వరూపం, త్రిప్తి డిమ్రితో సాగిన ఆ డైలాగ్స్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూడాలి. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ లో జోష్ మరింత పెరిగింది. తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Tags:    

Similar News