గొప్ప మనసు చాటుకున్న సందీప్ రెడ్డి వంగ.. ఏం చేశారో తెలుసా?
చేసింది మూడు సినిమాలే అయినా అద్భుతమైన డైరెక్షన్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగ.;
చేసింది మూడు సినిమాలే అయినా అద్భుతమైన డైరెక్షన్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగ. మొదట్లో సహాయ దర్శకుడిగా కెరియర్ మొదలుపెట్టి.. నేడు దర్శకుడిగా చలామణి అవుతున్నారు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న సందీప్ రెడ్డివంగా.. ఆ తర్వాత హిందీలో కబీర్ సింగ్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటీవల 'యానిమల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా ఏంటో చాటారు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో 'స్పిరిట్' సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా సెట్ పైకి వెళ్లనుంది.
గొప్ప మనసు చాటుకున్న సందీప్ రెడ్డి వంగా..
ఇదిలా ఉండగా.. తాజాగా సందీప్ రెడ్డివంగా గొప్ప మనసు చాటుకున్నారు. తన తమ్ముడు ప్రణయ్ రెడ్డి వంగతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని సగౌరవంగా కలిసిన సందీప్ రెడ్డివంగా.. అనంతరం సీఎం సహాయ నిధికి భారీ విరాళం అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి, అత్యవసర సమయాల్లో సహాయం అందించడానికి సుమారుగా 10 లక్షల రూపాయల విలువైన చెక్కును ఆయన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అందజేయడం గమనార్హం. దీనిపై ముఖ్యమంత్రి సీఎం రెడ్డి స్పందిస్తూ.. సందీప్ రెడ్డి వంగ అన్నదమ్ముల ఉదారతకు.. ప్రజా సంక్షేమం పట్ల వారి శ్రద్దను అభినందిస్తూ.. వారి గొప్ప మనసుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా సందీప్ రెడ్డివంగా మంచి మనస్సుకి అభిమానులు ఫిదా అవుతున్నారు.
స్పిరిట్ మూవీ అప్డేట్స్..
పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా రాబోతోంది. ప్రభాస్ హీరోగా, త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రయత్నాలు చేస్తున్నారు. మునుపేన్నడు చూడని విధంగా ప్రభాస్ ని ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందీప్ రెడ్డివంగా చూపించనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
స్పిరిట్ షూటింగ్ వాయిదా పడడానికి కారణం?
ఇదిలా ఉండగా.. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సినిమా షూటింగ్ మాత్రం పట్టాలెక్కలేదు. దీనికి కారణం ప్రభాస్ అనే చెప్పాలి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' సినిమా చేస్తున్నారు.ఈ సినిమా రీ షూటింగ్ వల్ల ప్రభాస్ తన సమయాన్ని ఈ చిత్రానికి కేటాయిస్తూ ఉండడం గమనార్హం. మరొకవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఇలా వరుస చిత్రాల బిజీ షెడ్యూల్ కారణంగానే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా సినిమా షూటింగు వాయిదా పడింది.