చెప్పా పెట్టకుండా చెంప పగులగొట్టాడు.. నటుడి ఆవేదన
నేను చెంప దెబ్బలు కొట్టాను.. నన్ను చెంప పగులగొట్టారని అన్నాడు హిందీ నటుడు సానంద్ వర్మ.;
నేను చెంప దెబ్బలు కొట్టాను.. నన్ను చెంప పగులగొట్టారని అన్నాడు హిందీ నటుడు సానంద్ వర్మ. తాను జీవితంలో చాలా ఎక్కువ చెంపదెబ్బలు కొట్టానని, తనకంటే ఎక్కువ చెంపదెబ్బలు కొట్టిన మరొకరిని చూపించలేరని అతడు అన్నాడు. అయితే తనను సీనియర్ నటుడు గుల్షన్ గ్రోవర్ ఉద్ధేశపూర్వకంగా చెంప దెబ్బ కొట్టాడని, అది వృత్తిపరమైన బెటర్ మెంట్ కోసం అయితే బావుండేదని అన్నాడు. అది సరైన చెంప దెబ్బ కాదని వాపోయాడు.
అతడు చెంప దెబ్బకొట్టగానే నా గొంతు కోసినట్టు లోలోన మదనపడ్డానని అన్నాడు. ఆ సంఘటన బాధించినా ఆ సమయంలో గుల్షన్ నవ్వుతూనే ఉన్నాడని తెలిపాడు. అతడు కొట్టాడు.. కానీ నేను అక్కడ వాతావరణం పాడవ్వకూడదని తిరిగి ఏమీ అనలేదని కూడా చెప్పాడు. ఇలాంటి చెంపదెబ్బలు నా జీవితంలో ఎన్నో. కానీ గుల్షన్ ఉద్దేశపూర్వకంగా చెంపదెబ్బ కొట్టడం బాలేదని కూడా సానంద్ వర్మ చెప్పాడు.
ఫస్ట్ కాపీ అనే వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో తాను చెంప దెబ్బ తిన్నానని అన్నాడు. ఆ సమయంలో చాలా కోపం వచ్చింది. కానీ నెగెటివిటీకి దూరంగా ఉన్నాను. గుల్షన్ గ్రోవర్ నేను అనే స్వీయ వ్యామోహంలో ఉండే వ్యక్తి అని నటుడు సానంద్ అన్నాడు.
సిద్ధార్థ్ కన్నన్‌తో సంభాషణ సమయంలో మాట్లాడుతూ గతంలో ఎప్పుడో జరిగిపోయిన ఈ విషయాన్ని ఎవరికీ ఇప్పటివరకూ చెప్పలేదని, మొదటిసారి దీనిని వెల్లడిస్తున్నానని అన్నాడు. ఆ సమయంలో కోపంలో గుల్షన్ గ్రోవర్‌ను కుర్చీతో కొట్టాలని అనుకున్నానని సానంద్ వర్మ చెప్పాడు.
గుల్షన్ తనను కొట్టే ముందు తనకు ఎటువంటి డిస్ క్లెమర్ కూడా ఇవ్వలేదని.. ఒకవేళ కారణం చెప్పి ఉంటే తాను నిజమైన చెంపదెబ్బకు సిద్ధంగా ఉండేవాడినని సానంద్ అన్నారు. ఎవరైనా చెంప దెబ్బ కొట్టే ముందు హెచ్చరించాలని కూడా అన్నాడు. గుల్షన్ అలా చేయనందున, నన్ను కొట్టిన తర్వాత కుర్చీ ఎత్తి కొట్టాలనుకున్నాను అని తెలిపాడు.
నా కెరీర్ లో వేల సార్లు చెంప దెబ్బలు కొట్టాను.. నా కంటే మరే నటుడు ఇన్ని చెంపదెబ్బలు కొట్టలేదు. వృత్తిపరంగా తాను కూడా చాలా చెంప దెబ్బలు తిన్నానని అన్నాడు. `భాభి జీ ఘర్ పర్ హైన్`లో కూడా తనను చాలాసార్లు చెంపదెబ్బ కొట్టారని, కానీ ప్రొఫెషనల్ వేలో అవన్నీ జరిగాయని అన్నాడు.