కాకులు దూరని కీకారణ్యంలో చిక్కుకున్న నటి
అడవులు కొండలు కోనలు దాటుకుంటూ ట్రెక్కింగ్ కి వెళ్లడమే కాదు.. ఈ సాహసయాత్రను ఫోటోల రూపంలో డాక్యుమెంట్ చేసి వాటిని అభిమానుల కోసం సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది.;
అడవిలో వెళుతుంటే అకస్మాత్తుగా వర్షం కురిస్తే, ఆపై వాగు వంకలు పొంగి పొర్లితే, అక్కడ ఏదైనా చెట్టు ఆపదలో నీడగా మారి కాపాడితే, అలాంటి గొప్ప అనుభవం ఎవరికైనా ఎప్పుడైనా ఎదురైందా...! ఇంచుమించు అలాంటి గమ్మత్తయిన అనుభవాన్ని ఎదుర్కోవడంలోని ఆనందాన్ని తన సొంతం చేసుకుంది సంయుక్త మీనన్.
అడవులు కొండలు కోనలు దాటుకుంటూ ట్రెక్కింగ్ కి వెళ్లడమే కాదు.. ఈ సాహసయాత్రను ఫోటోల రూపంలో డాక్యుమెంట్ చేసి వాటిని అభిమానుల కోసం సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. పచ్చని అడవి.. పైగా వర్షం కురుస్తోంది. వాతావరణం అంతా తేమగా ఉంది. ఆ ప్రదేశంలో నేల చిత్తడిగా ఉందని సంయుక్త షేర్ చేసిన ఫోటోలను బట్టి అర్థమవుతోంది. అక్కడ ఒక భీకరమైన వట వృక్షం.. దాని వేళ్ల మీదుగా ఒక మార్గం కూడా వేసి ఉంది.
బహుశా అలాంటి ఎగ్జోటిక్ లొకేషన్ లో ఫోటోలు దిగడం, వాటిని అభిమానులకు షేర్ చేసే అవకాశం దక్కడం సంయుక్త మీనన్ ని చాలా థ్రిల్ కి గురి చేసింది. ఇక వర్షంలో ప్రయాణిస్తోంది గనుక సంయుక్త కూడా హెయిర్ తడిసి వెట్ గా కనిపిస్తోంది. అయితే అడవిలో ప్రయాణం నిజంగా ఒక సాహసం. పైగా వర్షంలో ప్రయాణిస్తే అది మరీ ప్రమాదకరం. ఒక్కోసారి హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు వింతైన అనుభవాలు ఎదురు కావొచ్చు. దారిలో పురుగు పుట్రను కూడా దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. మార్గం సరిగా ఉండదు కనుక ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ట్రెక్కింగ్ అంటేనే అలాంటి కఠినమైన అనుభవాల సారం. దానిని సంయుక్త బాగానే మ్యానేజ్ చేసేస్తోంది. కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన సంయుక్త యువతరం హార్ట్ బీట్ గా మారింది.
స్వయంభు, బెంజ్ (తమిళం), అఖండ 2, రామ్ (మలయాళం) హైందవ, మహారాగ్ని (హిందీ), నారీ నారీ నడుమ మురారి లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తూ సంయుక్త బిజీ బిజీగా ఉంది.