రెండేళ్ల‌కు రీ ఎంట్రీలా ఆ బ్యూటీ!

మాలీవుడ్ బ్యూటీ సంయుక్తా మీన‌న్ టాలీవుడ్ కి మెరుపులా దూసుకొచ్చింది. రెండేళ్ల క్రితం వ‌ర‌కూ సినిమాలతో పుల్ బిజీగా క‌నిపించింది.;

Update: 2025-09-13 19:30 GMT

మాలీవుడ్ బ్యూటీ సంయుక్తా మీన‌న్ టాలీవుడ్ కి మెరుపులా దూసుకొచ్చింది. రెండేళ్ల క్రితం వ‌ర‌కూ సినిమాలతో పుల్ బిజీగా క‌నిపించింది. `డెవిల్` వ‌ర‌కూ ఒకే వేగంతో ప‌ని చేసింది. అటుపై ఒక్క‌సారిగా స్లో అయింది. దీంతో సంయుక్తా మీన‌న్ ఏమైపోయింద‌న్న చ‌ర్చ‌కు తెర‌తీసింది. గ‌త ఏడాది `ల‌వ్ మీ`లో గెస్ట్ అప్పిరియ‌న్స్ ఇచ్చింది. అటుపై కొత్త క‌మిట్ మెంట్లు క‌నిపించ‌క‌పోయే స‌రికి మ‌ళ్లీ మాలీవుడ్ కి వెళ్లిపోయిందా? అన్న సందేహం వ్య‌క్త‌మైంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో బాల‌య్య ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `అఖండ 2`లో అవ‌కాశం అందుకోవ‌డంతో అభిమానులంతా హ‌మ్మ‌య్యా? అనుకున్నారు.

తొలి పాన్ ఇండియా చిత్రంలో:

అక్క‌డ నుంచి మ‌ళ్లీ కొత్త అవ‌కాశాలు అందుకోవ‌డం మొద‌లు పెట్టింది. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. కానీ వాటి రిలీజ్ లే ఆల‌స్య‌మ‌వుతున్నాయి. రెండేళ్ల త‌ర్వాత అమ్మ‌డు న‌టిస్తోన్న `అఖండ‌2` రిలీకు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో? ఈ చిత్ర‌మే సంయుక్తామీన‌న్ కు ఓ రీలాంచ్ మూవీలా హైలైట్ అవుతుంది. దీంతో `అఖండ 2` ప‌ర్పెక్ట్ రీలాంచ్ లా క‌నిపిస్తోంది. ఈ సినిమాపై అంచ‌నాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. బాల‌య్య తొలి పాన్ ఇండియా సినిమా అయినా? బాల‌య్య ఇంకా సీన్ లోకి రాక‌పోయినా కుంభ‌మేళా పుణ్యామా? అని పాన్ ఇండియాలో ప్ర‌చారం ద‌క్కింది.

ఇండ‌స్ట్రీని షేక్ చేసేలా:

దీంతో ఇండియా వైడ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న డిస్క‌ష‌న్ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. దీంతో సంయుక్తా మీన‌న్ పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది అంతే ఆస‌క్తిక‌రంగా మారింది. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి హీరోయిన్ల‌ను కేవ‌లం పాట‌ల‌కు, రొమాంటిక్ స‌న్నివేశాల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసే ద‌ర్శ‌కుడు కాదు. స‌హ‌జంగా బోయ‌పాటి సినిమాల్లో లేడీ పాత్ర‌లు ఎన్ని ఉన్నా? వాటికి కూడా మంచి గుర్తింపు ద‌క్కుతుంది. హీరోయిన్ కు పెద్ద పీట వేయ‌డం బోయ‌పాటి ప్ర‌త్యేక‌త‌. ఈ నేప‌థ్యంలో సంయుక్తా మీనన్ కు ఈ సినిమాతోనూ మంచి గుర్తింపు దక్కుతుంద‌ని..గొప్ప కంబ్యాక్ చిత్రంగా నిలుస్తుంద‌నే అంచ‌నాలున్నాయి.

అఖండ‌తో ముగించి వాటితో వెల్క‌మ్:

`డెవిల్` త‌ర్వాత గుర్తింపునిచ్చే పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని అమ్మ‌డి అభిమానులు ఆశీస్తున్నారు. ఇంకా తెలుగులో మ‌రో పాన్ ఇండియా చిత్రం `స్వ‌యంభూ`లోనూ న‌టిస్తోంది. ఇందులో నిఖిల్ కి జోడీగా క‌నిపించ‌నుంది. అలాగే యంగ్ హీరో శ‌ర్వానంద్ కు పెయిర్ గా `నారీ నారీ న‌డుమ మురారీ`లోనూ న‌టిస్తోంది. పూరి-విజ‌య్ సేతుప‌తి చిత్రంలోనూ అల‌రించ‌నుంది. ఇవి గాక బాలీవుడ్ లో ఓ రెండు సినిమాలు,మాలీవుడ్ లో ఓ చిత్రం చేస్తోంది. ఈ సినిమాల‌న్నీ కొత్త ఏడాదిలో రిలీజ్ కానున్నాయి. ఈనేప‌థ్యంలో 2025ని `అఖండ`తో ముగించి 2026కి కొత్త చిత్రాల‌తో వెల్క‌మ్ ప‌ల‌క‌నుంది.

Tags:    

Similar News