ఆ మూవీలో సంయుక్తా మీన‌న్ బోల్డ్ గానా!

మాలీవుడ్ బ్యూటీ సంయుక్తా మీన‌న్ టాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `భీమ్లానాయ‌క్` తో ఎంట్రీ ఇచ్చిన‌ అమ్మ‌డు అటు పై `బింబిసార` తో మ‌రో విజ‌యాన్ని అందుకుంది.;

Update: 2025-11-22 23:30 GMT

మాలీవుడ్ బ్యూటీ సంయుక్తా మీన‌న్ టాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `భీమ్లానాయ‌క్` తో ఎంట్రీ ఇచ్చిన‌ అమ్మ‌డు అటు పై `బింబిసార` తో మ‌రో విజ‌యాన్ని అందుకుంది. ఈ రెండు విజ‌యాలు అమ్మ‌డికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అటుపై క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన `డెవిల్` లోనూ మెరిసింది. మ‌ధ్య‌లో `సార్`, `విరూపాక్ష‌` తో మ‌రో రెండు డీసెంట్ హిట్స్ అందుకుంది. ఈ చిత్రాలు వేటిలోనూ సంయుక్తా మీన‌న్ గ్లామ‌ర్ ప‌రంగా ఛాన్స్ తీసుకోలేదు. పూర్తి న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లోనే క‌నిపించింది. త‌న లో న‌టిని మాత్ర‌మే హైలైట్ చేసింది.

అలాగ‌ని సంయుక్తా మీన‌న్ అందాల ఆర బోత‌కు వెన‌క‌డుగు వేసే న‌టి కాదు. కెరీర్ ఆరంభంలో మాలీవుడ్ చిత్రాల్లోనే బోల్డ్ స‌న్నివేశాలో చెల‌రేగింది. కానీ ఆ త‌ర్వాత రొమాంటిక్ పాత్ర‌ల్లో క‌నిపించ‌లేదు. అదే స‌మ‌యంలో తెలుగులో అవ‌కాశాలు రావ‌డంతో? ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కు పూర్తిగా దూర‌మైంది అయింది. కానీ ఆమెలో బోల్డ్ యాంగిల్ ని మ‌ళ్లీ బోయ‌పాటి త‌ట్టిలేపాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. న‌టిసింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీను `అఖండ 2` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `అఖండ‌`కు సీక్వెల్ గా రూపొందుతున్న‌చిత్ర‌మిది.

భారీ అంచ‌నాల మ‌ద్య డిసెంబ‌ర్ 5న రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే ప్రచారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. బాల‌య్య కెరీర్ లో తొలి పాన్ ఇండియా రిలీజ్ కావ‌డంతో దేశ‌మంతా చుట్టేస్తున్నారు. ఇప్ప‌టికే ముంబై, క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారం ముగించారు. ఈ నేప‌థ్యంలో సంయుక్తా మీన‌న్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. సినిమాలో అమ్మ‌డు బోల్డ్ అప్పిరియ‌న్స్ తో ఆక‌ట్టుకుంది? అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. బాల‌య్య సెకెండ్ లీడ్ కు హీరోయిన్ గా న‌టిస్తోంది. దీంతో పాత్రకు రొమాంటిక్ ట‌చ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

హీరోయిన్ల విష‌యంలో బోయ‌పాటి అందంగా హైలైట్ చేసే క్ర‌మంలో ఛాన్స్ తీసుకుంటారు. అంద‌మైన న‌టీ మ‌ణుల్ని త‌న‌దైన శైలిలో ఆవిష్క‌రించ‌డం బోయ‌పాటి ప్ర‌త్యేక‌త‌. ఆయ‌న గ‌త సినిమాల్లో న‌టించిన ప్ర‌గ్యాజై శ్వాల్, సోనాల్ చౌహాన్, క్యాథ‌రీన్ లాంటి భామ‌ల‌ను ఎంత బ్యూటీఫుల్ గా చూపించాడో తెలిసిందే. రొమాంటిక్ సీన్ ప‌డాల్సిన చోట ప‌ర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసాడు. ఈ నేప‌థ్యంలో సంయుక్తామీన‌న్ ను మాలీవుడ్ సినిమాల ఆధారంగా తీసుకుని కాస్త ఘాటుగానే చూపించిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ ప్రచారంలో నిజ‌మెంత‌? అన్న‌ది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం సంయుక్త కిట్టీలో చాలా ప్రాజెక్ట్ లున్నాయి. సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది.

Tags:    

Similar News