• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గేమ్ ఛేంజర్.. ఓ లీక్...

గేమ్ ఛేంజర్.. ఓ లీక్ ఇచ్చిన ఖని!

| గేమ్ ఛేంజర్ విషయానికొస్తే రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది

By - Tupaki Desk
Update: 2023-08-04 05:57 GMT

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్టార్ హీరో కొడుకైనప్పటికీ... సొంతంగా వరల్డ్ వైడ్ లో స్టార్ స్టేటస్ అందుకున్నప్పటికీ.. ఎంతో ఒదిగి ఉంటారు. ఎన్నో మంచి పనులు కూడా చేశారు. ఇదే విషయాన్ని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. చరణ్ ది చాలా మంచి మనసు అని ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు.

అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని పవన్ 'బ్రో' డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖని కూడా అన్నారు. చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే చరణ్ గేమ్ ఛేంజర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను కూడా లీక్ చేశారు. సినిమాలో రామ్ చరణ్ పక్కన తన పాత్ర ఎలా ఉండబోతుందో వివరించారు.

"రామ్ చరణ్ లాంటి మంచి మనిషికి ఏ కష్టం రాకూడదు. ఆయనకు అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అంటుంటాడు. నాకు చరణ్ ఎప్పుడు ఓ కొడుకు లాంటి వాడు. గేమ్ ఛేంజర్ సినిమాలోనూ నాది అలాంటి పాత్రే. చరణ్ తో పని చేసిన వారు ఎవరైనా ఆయన క్యారెక్టర్ కు ఫ్యాన్స్ అయిపోతారు" అని సముద్రఖని పేర్కొన్నారు. దీని బట్టి గేమ్ ఛేంజర్ లో సముద్రఖనిది రామ్ చరణ్ బాబాయ్ పాత్ర అని అర్థమవుతోంది.

ఇప్పటికే సముద్రఖని-చరణ్ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కలిసి నటించారు. ఇందులో కూడా చరణ్.. సముద్రఖనిని బాబాయ్ అని పిలుస్తుంటారు. వీరిద్దరి మధ్య వచ్చిన బాండింగ్ సన్నివేశాలు కూడా ఆడియెన్స్ ను ఎమోషన్స్ కు గురి చేశాయి. చూడాలి మరి గేమ్ ఛేంజర్ లో వీరిద్దరి మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయో! కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ వ్యక్తిత్వానికి ఎన్టీఆర్ కూడా ఫిదా అయిపోయారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు.

గేమ్ ఛేంజర్ విషయానికొస్తే.. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దిగ్గజ దర్శకుడు శంకర్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి రెండు లేదా మూడో వారంలో సినిమా రిలీజయ్యే అవకాశం ఉంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు నటిస్తున్నారు.

Tags:    
  • Samuthirakani 
  • Ramcharan 
  • BROmive 
  • Gamechanger 
  • Kiaraadvani 
  • Anjali 
  • Shankar 
  • Gamechangerfilm 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS