సమంత పెళ్లి.. ఆ 'సౌండ్' ఎందుకు మిస్ అయ్యింది?
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటేనే ఒక పెద్ద హడావుడి. ఫోటోలు, వీడియోలు, మీమ్స్.. ఇలా రోజు మొత్తం దాని గురించే చర్చ నడుస్తుంది.;
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటేనే ఒక పెద్ద హడావుడి. ఫోటోలు, వీడియోలు, మీమ్స్.. ఇలా రోజు మొత్తం దాని గురించే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఒక టాప్ హీరోయిన్ రెండో పెళ్లి చేసుకుంటుందంటే ఆ హడావుడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆమె కట్టిన చీర ఎంత కాస్ట్లీ, ఆభరణాలు ఏంటీ? అలాగే పెళ్లిలో భోజనాల నుంచి గెస్టుల వరకు ఇలా అన్ని విషయాల్లో ఒక బజ్ ఉంటుంది. కానీ లేటెస్ట్ గా జరిగిన సమంత పెళ్లి విషయంలో మాత్రం సోషల్ మీడియాలో ఎందుకో ఆశించిన స్థాయిలో 'బజ్' కనిపించలేదు. ఇది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గతంలో సమంత తన మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు, ఆ తర్వాత జరిగిన పరిణామాల సమయంలో సోషల్ మీడియా ఏ రేంజ్ లో షేక్ అయిందో తెలిసిందే. ప్రతి చిన్న విషయానికి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇక ఆమె మాజీ భర్త రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అంతే స్థాయిలో రచ్చ జరిగింది. కానీ ఇప్పుడు సమంత డైరెక్టర్ రాజ్ నిడమూరును పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం ఆ హడావుడి ఎక్కడా కనిపించలేదు.
దీనికి కారణం ఏమై ఉంటుందా అని విషయంలో రకరకాల కామెంట్స్ వినబడుతున్నాయి. ఒకవేళ జనాలు ఇలాంటి వార్తలకు అలవాటు పడిపోయారా? లేక సమంత ఈ పెళ్లిని చాలా లో ప్రొఫైల్ లో ఉంచడమే కారణమా? గత కొంతకాలంగా ఆమె ఈ రిలేషన్ షిప్ గురించి హింట్లు ఇస్తున్నప్పటికీ, ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. పెళ్లి ఫోటోలు వచ్చాకే అందరికీ కన్ఫర్మ్ అయింది. బహుశా ఈ సైలెన్స్ స్ట్రాటజీనే ఆమె ఫాలో అయ్యారేమో అనిపిస్తోంది.
మరోవైపు ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు అయినా, సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండే పర్సన్ కాదు. పైగా వీరిద్దరి మధ్య ఉన్నది మెచ్యూర్డ్ రిలేషన్ షిప్ కావడం, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా పెళ్లి చేసుకోవడం కూడా ఈ 'సైలెన్స్' కు ఒక కారణం కావచ్చు. సాధారణంగా ఇలాంటి విషయాలపై నెటిజన్లు ఎగబడి కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం చాలా సాదాసీదాగా స్పందించారు.
ఒక స్టార్ హీరోయిన్ లైఫ్ లో ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు, కనీసం ఆ బజ్ కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. బహుశా ఆమె పర్సనల్ లైఫ్ పట్ల జనాల్లో ఆసక్తి తగ్గిందా? లేక ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించి సైలెంట్ గా ఉన్నారా? ఏదేమైనా గతంలో జరిగిన సంఘటనలతో పోలిస్తే, ఈసారి సోషల్ మీడియా రియాక్షన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది.
మొత్తానికి సమంత తన కొత్త జీవితాన్ని చాలా ప్రశాంతంగా మొదలుపెట్టారు. సోషల్ మీడియా గోల లేకుండా, అనవసరపు చర్చలు లేకుండా సింపుల్ గా ముగించేశారు. బహుశా ఆమె కోరుకున్నది కూడా ఇదేనేమో. సెలబ్రిటీల పెళ్లిళ్లంటే హంగామా ఉండాలనే రూల్ ఏమీ లేదుగా.. సైలెంట్ గా చేసుకోవడంలోనూ ఒక అందం ఉంటుందని ఈ పెళ్లి నిరూపించింది.